Telangana: వరంగల్ లో మరో పుష్ప.. అక్కడ కత్తి, ఇక్కడ బ్లేడ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనకాపల్లి(Anakapalle) లో జరిగిన పుష్ప ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. సర్ ప్రైజ్ ఇస్తా..కళ్లు మూసుకోవాలని చెప్పి ఓ యువతి కాబోయే భర్త గొంతు కోసింది. ఈ ఘటన తీవ్ర...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనకాపల్లి(Anakapalle) లో జరిగిన పుష్ప ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. సర్ ప్రైజ్ ఇస్తా..కళ్లు మూసుకోవాలని చెప్పి ఓ యువతి కాబోయే భర్త గొంతు కోసింది. ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ సంఘటనను మరవకముందే తెలంగాణ(Telangana) లోని హనుమకొండలో మరోసారి పుష్ప(Pushpa) సీన్ రిపీట్ అయింది. హనుమకొండ జిల్లాలోని దామెర మండలంలోని పసరకొండ గ్రామంలో దారుణం జరిగింది. గ్రామానికి చెందిన మాడిశెట్టి రాజు అనే వ్యక్తికి అర్చనతో పెళ్లి అయింది. కొద్ది రోజులు సజావుగా సాగిన వీరి కాపురంలో విభేదాలు తలెత్తాయి. చిన్నచిన్న వాటికే ఘర్షణకు దిగారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన భార్య.. బ్లేడుతో భర్త గొంతు కోసింది. వెంటనే అప్రమత్తమైన కుటుంబసభ్యులు బాధితుడిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. వీరి వివాహమై నెల రోజులు కూడా గడవకముందే ఈ ఘటన జరగడం అందరినీ షాక్ కు గురి చేసింది.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
Also Read
Vijayawada: పురుగుల మందు తాగి కుటుంబం ఆత్మహత్యాయత్నం.. అప్రమత్తమైన పోలీసులు ఏం చేశారంటే