Watch: జనగామ జిల్లాలో కారు బీభత్సం.. పల్టీలు కొడుతూ ఇంట్లోకి దూసుకెళ్లింది..

అయితే, ప్రమాదం జరిగిన వెంటనే కారులో ఉన్న ఇద్దరు యువకులు పరారైనట్టుగా స్థానికులు తెలిపారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థానికుల కంప్లైట్‌ మేరకు సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Watch: జనగామ జిల్లాలో కారు బీభత్సం.. పల్టీలు కొడుతూ ఇంట్లోకి దూసుకెళ్లింది..
Car Crashed
Follow us
Jyothi Gadda

|

Updated on: Oct 21, 2024 | 10:57 AM

జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో అతివేగంతో కారు నడిపిన ఇద్దరు యువకులు స్థానికుల్ని భయబ్రాంతులకు గురి చేశారు. పాలకుర్తి మండల కేంద్రంలోని ఓ ఆసుపత్రి ముందు రెండు బైక్ లను ఢీ కొట్టి పక్కనే ఉన్న చెట్టును ఢీ కొట్టారు. కారు అతివేగంగా ఉండడంతో చెట్టును బలంగా ఢీ కొని పల్టీలు కొడుతూ పక్కనే ఉన్న ఓ ఇంట్లోకి కారు దూసుకెళ్లింది. అదృష్టవాశత్తూ ఎలాంటి ప్రాణాపాయం జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.

అయితే, ప్రమాదం జరిగిన వెంటనే కారులో ఉన్న ఇద్దరు యువకులు పరారైనట్టుగా స్థానికులు తెలిపారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థానికుల కంప్లైట్‌ మేరకు సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కారులోని యువకుల కోసం గాలిస్తున్నారు. కారు నడిపిన వ్యక్తి మైనర్ గా తెలుస్తుంది.

ఈ వీడియోపై క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే, ఇటీవలే జనగామ జిల్లాలో కేంద్రం కారు డ్రైవింగ్ నేర్చుకుంటున్న ఇద్దరు వ్యక్తులు అదుపు తప్పి కారుతో సహా నేరుగా చెరువులోకి దూసుకెళ్లారు. కారు నీళ్లలో మునిగిపోతుండగా, వారిద్దరూ ప్రాణాలతో బయటపడ్డారు. డ్రైవింగ్ నేర్చుకునే క్రమంలో కారు స్టీరింగ్ అదుపుతప్పి కారుతో సహా డ్రైవింగ్ నేర్చుకుంటున్న వ్యక్తి, శిక్షణ ఇస్తున్న వ్యక్తి ఇద్దూ కుంటలో పడి పోయారు. వారిని స్థానికులు పాడారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..