AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Srisailam: శ్రీశైలం మల్లన్న ఆలయానికి పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి ఎంత సమయం పడుతుందంటే..!

ఇక, మరికొద్ది రోజుల్లో ఆశ్వయుజ మాసం ముగిసి కార్తీకమాసం ప్రారంభం కాబోతుంది. ఈ ఏడాది దీపావళి పండుగ అయిపోయిన తర్వాత నవంబర్ 2 నుంచి కార్తీకమాసం ప్రారంభం అవుతుంది. కార్తీక మాసంలో శ్రీశైలంలో భక్తుల రద్దీ

Srisailam: శ్రీశైలం మల్లన్న ఆలయానికి పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి ఎంత సమయం పడుతుందంటే..!
Srisailam Temple
Jyothi Gadda
|

Updated on: Oct 21, 2024 | 9:40 AM

Share

నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలోని ముక్కంటి మల్లన్న ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. సోమవారం శివునికి ప్రీతికరమైన రోజు కావడంతో శ్రీశైలంలో భక్తులు రద్దీ పెరిగింది. క్షేత్రమంత భక్తజనంతో సందడి వాతావరణం నెలకొంది. వేకువజాము నుండే భక్తులు పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి శ్రీభ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్ల దర్శనార్థమై క్యూలైన్లు, దర్శన కంపార్టుమెంట్లలో బారులు తీరారు. శ్రీ స్వామి అమ్మవార్ల దర్శనానికి సుమారు 4 గంటల సమయం పడుతుంది. స్వామి అమ్మవారి రుద్రాభిషేకం, కుంకుమార్చన తదితర అభిషేకార్చనలు నిర్వహించి మొక్కులు తీర్చుకుంటున్నారు.

అయితే భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ క్యూలైన్లలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా శ్రీస్వామి అమ్మవార్లను దర్శించుకునేలా ఆలయ ఇన్చార్జి ఈవో చంద్రశేఖర్ రెడ్డి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దర్శనార్థమై క్యూలైన్లు,కంపార్ట్మెంట్లలో ఉన్న భక్తులకు ఎప్పటికప్పుడు అల్పాహారం,పాలు,బిస్కెట్స్ మంచినీరు అందిస్తున్నామని దేవస్థానం ఇన్చార్జి ఈవో చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు.

ఈ వీడియోపై క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి

ఇక, మరికొద్ది రోజుల్లో ఆశ్వయుజ మాసం ముగిసి కార్తీకమాసం ప్రారంభం కాబోతుంది. ఈ ఏడాది దీపావళి పండుగ అయిపోయిన తర్వాత నవంబర్ 2 నుంచి కార్తీకమాసం ప్రారంభం అవుతుంది. కార్తీక మాసంలో శ్రీశైలంలో భక్తుల రద్దీ మరింతగా పెరిగే అవకాశం ఉంది. రోజుకు లక్షల సంఖ్యలో కూడా భక్తులు వస్తుంటారు. ఇక్కడ కార్తీక పుణ్యస్నానాలు, కార్తీక దీపాలు వెలిగించటం వల్ల పుణ్యఫలం దక్కుతుందని భక్తుల విశ్వాసం.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..