AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: కొడుకు కాదు.. కాలయముడు.. కాసుల కోసం కన్నతల్లినే కడతేర్చాడు!

తన తల్లి బ్యాంక్ అకౌంట్‌లో జమ చేసుకున్న డబ్బులు తనకు ఇవ్వడం లేదనే అక్కసుతో ఓ కసాయి కొడుకు మానవ మృగంలా ప్రవర్తించాడు. కన్నతల్లిపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టాడు. ఒళ్ళంతా కాలిన గాయాలతో మూడు రోజులపాటు మృత్యువుతో పోరాడిన ఆ తల్లి చివరకు ప్రాణాలు కోల్పోయింది. ఈ హృదయవిదారక ఘటన వరంగల్‌ జిల్లాలో వెలుగు చూసింది.

Telangana: కొడుకు కాదు.. కాలయముడు.. కాసుల కోసం  కన్నతల్లినే కడతేర్చాడు!
Warangal
G Peddeesh Kumar
| Edited By: Anand T|

Updated on: Jul 01, 2025 | 4:42 PM

Share

తన తల్లి బ్యాంక్ అకౌంట్‌లో జమ చేసుకున్న డబ్బులు తనకు ఇవ్వడం లేదనే అక్కసుతో ఓ కసాయి కొడుకు మానవ మృగంలా ప్రవర్తించాడు. కన్నతల్లిపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టాడు. ఒళ్ళంతా కాలిన గాయాలతో మూడు రోజులపాటు మృత్యువుతో పోరాడిన ఆ తల్లి చివరకు ప్రాణాలు కోల్పోయింది. ఈ హృదయవిదారక ఘటన వరంగల్‌ జిల్లాలో వెలుగు చూసింది. వివరాళ్లోకి వెళితే.. సంగెం మండలం కుంటపల్లి గ్రామానికి చెందిన వినోద – సాంబయ్య దంపతుల సతీష్ అనే కుమారుడు ఉన్నారు. సతీష్‌కు తల్లిదండ్రులు ఇటీవలే పెళ్లి కూడా చేశారు. అయితే ఈ మధ్య కాలంలో తల్లి అకౌంట్‌లో రూ.5లక్షలు ఉన్నట్టు గుర్తించిన సతీష్‌.. అప్పటి నుంచి ఆమెను డబ్బుల కోసం వేధించడం మొదలుపెట్టాడు. కొడుకుకు డబ్బులు ఇచ్చేందుకు తల్లి నిరాకరించడంతో.. ఈ గొడవ కాస్తా పెద్దల పంచాయతీ వరకు వెళ్లింది. ఈ క్రమంలో తల్లిదండ్రులు, సతీస్‌, అతని భార్యను పలిపించి మాట్లాడిన పెద్దలు.. రెండు కుటుంబాలు వేరువేరుగా ఉండాలని నిర్ణయించారు.

ఈ క్రమంలో సతీష్ తన కుటుంబంతో కలిసి గీసుకొండ మండలం గంగదేవిపల్లిలో ఉంటున్నాడు. అతని తల్లిదండ్రులు తమ స్వగ్రామంలోనే ఉంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే అడిగిన డబ్బులు ఇవ్వకపోగా.. తనను ఇంట్లో నుంచి బయటకు పంపించేలా చేసిందని.. తల్లిపై కోపం పెంచుకున్న కొడుకు సతీష్‌ ఆమెపై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే ఈ నెల 28 రాత్రి తల్లి ఇంటికి వెళ్లి.. ఇంటికి ముందు నిద్రిస్తున్న తల్లి వినోదపై పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు. దీంతో తల్లి వినోద కేకలు వేయడంతో అప్రమత్తమైన స్థానికులు వెంటనే ఆమెకు అంటుకున్న మంటలను చల్లార్చారు.

అయితే, వాళ్లు మంటలు ఆర్పేలోపే వినోద శరీరం సుమారు 85శాతం కాలిపోయింది. దీంతో స్థానికులు వెంటనే ఆమెను ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు. ఆమెను పరీక్షించిన వైద్యులు అత్యవసర చికిత్స అవసరమని వెంటనే ట్రీట్‌మెంట్‌ స్టార్ట్‌ చేశారు. ఇక మూడు రోజుల పాటు మృత్యువుతో పోరాడిన వినోద చివరకు సోమవారం తనువు చాలించింది. తండ్రి ఫిర్యాదుతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు సతీష్‌ను అదుపులోకి తీసుకున్నారు. డబ్బుల కోసమే అతికిరాతకంగా తల్లిపై పెట్రోల్‌పోసి హత్య చేసినట్టు నిర్థారించిన పోలీసులు సతీష్‌ను రిమాండ్‌కు తరలించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పంటి ఎనామిల్‌ను నాశనం చేస్తున్న అలవాటు.. మానకుంటే కష్టమే!
పంటి ఎనామిల్‌ను నాశనం చేస్తున్న అలవాటు.. మానకుంటే కష్టమే!
వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా