Warangal Mayor: లిప్ట్‌లో ఇరుక్కుపోయిన వరంగల్ మేయర్ గుండు సుధారాణి.. సిబ్బంది అప్రమత్తతతో తప్పిన ముప్పు

ఓ ప్రైవేట్ ఆసుపత్రి ప్రారంభోత్సవానికి వెళ్లిన వరంగల్ మేయర్ గుండు సుధారాణి లిప్ట్‌లో ఇరుక్కుపోయారు.

Warangal Mayor: లిప్ట్‌లో ఇరుక్కుపోయిన వరంగల్ మేయర్ గుండు సుధారాణి.. సిబ్బంది అప్రమత్తతతో తప్పిన ముప్పు
Warangal Mayor Gundu Sudharani

Updated on: Aug 12, 2021 | 9:40 PM

Warangal Mayor Gundu Sudharani: వరంగల్ మేయర్ గుండు సుధారాణి లిప్ట్‌లో ఇరుక్కుపోయారు. హన్మకొండ చౌరస్తాలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి ప్రారంభోత్సవానికి వచ్చారు మేయర్ గుండు సుధారాణి. ఆసుపత్రిని ప్రారంభించిన అనంతరం బయటకు తిరిగు పయనమయ్యారు. అక్కడే ఉన్న లిఫ్ట్‌లో ఎక్కి గ్రౌండ్ ఫ్లోర్‌కు వెళ్తుండగా, లిఫ్ట్ ఒక్కసారిగా ఆగిపోయింది. దీంతో మేయర్ గుండు సుధారాణి లిఫ్ట్‌లో ఇరుక్కుపోయారు. గుండు సుధారాణిని సిబ్బంది ఎలాగోలా బయటకు తీసుకు వచ్చారు. కాగా, ఎలాంటి గాయాలు కాకుండా ఆమె సురక్షితంగా బయట పడగలిగారు. దీంతో ఆసుపత్రి యాజమాన్యంతో పాటు అంతా ఉపిరి పీల్చుకున్నారు.

కొత్తగా ఏర్పాటు చేసిన హాస్పిటల్ ప్రారంభించడానికి ముఖ్య అతిథిగా హజరై, తిరిగి వచ్చే క్రమంలో ఆమె లిఫ్ట్ లో ఇరుక్కోవడం కలకలం రేపింది. బిల్డింగ్ యాజమాని నిపుణులను రప్పించి లిఫ్ట్ ని రిపేర్ చేయించారు. సుమారు 10 నిమిషాల పాటు మేయర్ సుధారాణి అందులోనే ఉండిపోయారు. ఇటీవల జరిగిన గ్రేటర్ వరంగల్ ఎన్నికల్లో ఆమె తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తరుపున కార్పొరేటర్‌గా విజయం సాధించి మేయర్‌గా బాధ్యతలు చేపట్టారు. అయితే, పరిమితి కంటే ఎక్కువ మంది లిఫ్టులో ఎక్కడం వల్లే సాంకేతిక లోపం తలెత్తినట్లు అధికారులు తెలిపారు.

Read Also…Himachal Pradesh: అశాస్త్రీయ కట్టడాల వల్లే హిమాచల్ ప్రదేశ్ లో ప్రకృతి వైపరీత్యాలు.. పర్యావరణ నిపుణుల ఆందోళన