AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Warangal: కళ్లు తెరిచిన అమ్మవారు.. పోటెత్తిన భక్తజనం.. ఓ మహిళకు పూనకం.. ఏం చెప్పిందంటే..?

వరగంల్‌ వేణుగోపాల స్వామి గుడిలో గోదాదేవి కళ్లు తెరిచిందన్న వార్త క్షణాల్లో దావానలంలా ఆ ప్రాంతమంతా వ్యాపించింది. దీంతో భక్తులు ఆ వింతను చూడటానికి పోటెత్తారు.

Warangal: కళ్లు తెరిచిన అమ్మవారు.. పోటెత్తిన భక్తజనం.. ఓ మహిళకు పూనకం.. ఏం చెప్పిందంటే..?
Warangal Goda Devi
Ram Naramaneni
|

Updated on: Dec 26, 2022 | 11:53 AM

Share

మనలో చాలామంది దేవుడి మహిమను నమ్ముతుంటారు.. కొన్ని ఘటనలు చూస్తే.. నాస్తికులకు కూడా అలాంటి ఫీలింగ్ కలుగుతుంది. తాజాగా వరంగల్‌ నగరంలో అలాంటి అద్భుతమే జరిగిందని భక్తులు చెబుతున్నారు. గుడిలో ఉన్నట్టుండి అమ్మవారు కళ్లు తెరిచి చూసిందని.. భక్తులు ఉప్పొంగిపోతున్నారు. వరంగల్ నగరంలో శ్రీ వేణుగోపాలస్వామి గుడిలోని గోదాదేవి అమ్మవారు కళ్ళు తెరిచి చూసిందని.. అద్భుత సన్నివేశం ఆవిష్క్రతమైందని భక్తులు చెబుతున్నారు.  అమ్మవారు కుడి కన్ను తెరిచిందనే ప్రచారం ఆనోటా ఈనోటా పాకడంతో ఈ వింతను చూసేందుకు భక్తజనం బారులు తీరారు. గంటల తరబడి భక్తులు క్యూలో నిలబడి అమ్మవారిని దర్శించుకున్నారు. కళ్ళు తెరిచిన అమ్మవారిని దర్శించుకోవడం కోసం వచ్చిన ఓ భక్తురాలికి పూనకం రావడంతో స్థానికుల్లో భక్తి భావం ఉప్పొంగింది.

సాధారణంగా దేవతా విగ్రహాలు కళ్లు మూసి ఉన్నట్లు గాని, సగం మాత్రమే తెరిచి ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ అమ్మవారి కళ్లు సడెన్ గా తెరుచుకోవడం ఇదంతా దేవి మహిమే అంటున్నారు.  అమ్మవారి లీలతోనే ఇలా జరిగిందని చెబుతున్నారు కొంతమంది ఇదంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ విషయం వైరల్‌గా మారింది.

విగ్రహం పాలు తగడం.. పాము శివుడికి పూజ చేయడం.. ఆవు గుడి చుట్టూ ప్రదక్షిణ చేయడం.. ఆంజనేయుడు కళ్లు తెరవడం.. కొబ్బరి కాయ వినాయకుడి రూపంలో ఉండడం.. రాముడు కన్నీరు కార్చడం.. ఇలా నిత్యం వీటి గురించి వింటూ ఉంటాం.. కానీ దీనికి కారణం ఏంటి అన్నది మాత్రం తెలియడం లేదు. వింత ఘటనలుగానే మిగిలి పోతున్నాయి. హిందువుల్లో ఎక్కువమంది దేవుళ్లకు మహిమలు ఉన్నాయని గట్టిగా నమ్ముతారు. వారి నమ్మకాలను ఇలాంటి ఘటనలు నిజమే అనేలా చేస్తున్నాయి. దేవుళ్ళనే కాదు.. ప్రకృతిలోని జంతువులను, పక్షులను కూడా అత్యంత భక్తి శ్రద్దలతో కొలిచే సంప్రదాయం భారతీయుల సొంతం. అందుకే రాయిలో కూడా దేవుని ప్రతిరూపాన్ని చూసుకుని పూజలు చేస్తుంటారు.

తాజాగా వరగంల్‌ వేణుగోపాల స్వామి గుడిలో గోదాదేవి కళ్లు తెరిచిందన్న వార్త క్షణాల్లో దావానలంలా ఆ ప్రాంతమంతా వ్యాపించింది. దీంతో భక్తులు ఆ వింతను చూడటానికి పోటెత్తారు. కళ్లుతెరిచి దర్శనమిచ్చిన అమ్మవారిని దర్శించుకునేందుకు పోటీపడ్డారు. అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..