Warangal: అబ్బో.. వీళ్ళు మహాముదుర్లు! వ్యాపారులకు చెమటలు పట్టించి.. అందిన కాడికి దోచేసిన నకిలీ అధికారుల

| Edited By: Srilakshmi C

Sep 22, 2023 | 10:20 AM

హలో.. నేను మున్సిపల్ ఆఫీస్ బిల్ కలెక్టర్ ను మాట్లాడుతున్నాను.. మీ ట్రేడ్ లైసెన్స్ బాకీ ఉంది.. వెంటనే చెల్లిస్తారా లేక మీ షాప్ సీజ్ చేయాలా..? అని ఇంటిపేరు, ఊరు పేరు, షాప్ పేరు, షాప్ నెంబర్ తో సహా చెప్పి ఘరానా దోపిడీలకు తెర లేపారు కేటుగాళ్లు. కొందరు వ్యాపారులు ఆ కేటుగాళ్ళ బెదిరింపులు అంతా సెల్ ఫోన్ లో ఆడియో రికార్డు చేయడంతో అసలు బండారం బయటపడింది. మున్సిపాలిటీలో ఇంటి దొంగలపై అనేక అనుమానాలు వ్యక్తం..

Warangal: అబ్బో.. వీళ్ళు మహాముదుర్లు! వ్యాపారులకు చెమటలు పట్టించి.. అందిన కాడికి దోచేసిన నకిలీ అధికారుల
Hanumakonda Municipal Office
Follow us on

హనుమకొండ, సెప్టెంబర్‌ 22: హలో.. నేను మున్సిపల్ ఆఫీస్ బిల్ కలెక్టర్ ను మాట్లాడుతున్నాను.. మీ ట్రేడ్ లైసెన్స్ బాకీ ఉంది.. వెంటనే చెల్లిస్తారా లేక మీ షాప్ సీజ్ చేయాలా..? అని ఇంటిపేరు, ఊరు పేరు, షాప్ పేరు, షాప్ నెంబర్ తో సహా చెప్పి ఘరానా దోపిడీలకు తెర లేపారు కేటుగాళ్లు. కొందరు వ్యాపారులు ఆ కేటుగాళ్ళ బెదిరింపులు అంతా సెల్ ఫోన్ లో ఆడియో రికార్డు చేయడంతో అసలు బండారం బయటపడింది. మున్సిపాలిటీలో ఇంటి దొంగలపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

వరంగల్ జిల్లా పరకాల మున్సిపాలిటీ పరిధిలో ఈ ఘరానా దోపిడీ జరిగింది.. పెద్ద పెద్ద షాపులను సెలెక్ట్ చేసుకున్న ఆ వ్యక్తులు వారికి డైరెక్ట్ గా ఫోన్ చేశారు.. మున్సిపాల్ ఆఫీస్ నుండి మాట్లాడుతున్నామని మీరు దరఖాస్తు చేసుకున్న ట్రేడ్ లైసెన్స్ రెన్యువల్ అయిందని మున్సిపాలిటీకి కొంత బకాయి ఉన్నారని, ఆ బకాయి వెంటనే ఫోన్ పే చేయాలని ఆదేశించారు. కొందరు వెంటవెంటనే ఫోన్ పే చేశారు. మరికొందరు వ్యాపారులకు అనుమానం వచ్చి మీరు ఎవరు..? ఎందుకు ఫోన్ చేశారని అతని పేరు వివరాలు ఆరా తీశారు.

ఫోన్లో తాను బిల్ కలెక్టర్ శ్రీనివాస్ నని గుర్తుపట్టలేదా..? నేను రెగ్యులర్ మీ దగ్గరికి వస్తుంటాను అని బుకాయించారు. కానీ బిల్ కలెక్టర్ వీరికి తెలిసిన వారు కావడంతో ఆ వాయిస్ తనది కాదని గుర్తించారు. వెంటనే అప్రమత్తమయ్యారు. మున్సిపల్ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో మున్సిపల్ అధికారులు కూడా స్పందించారు. ఎవరో నకిలీ అధికారులు ఈ రకమైన దోపిడీకి పాల్పడుతున్నారని గుర్తించి వ్యాపారులు ఎవరు నేరుగా ఫోన్ పే చేయడం, ఎవరికి డబ్బులు చెల్లించడం చేయవద్దని పరకాల మున్సిపల్ కమిషనర్ కార్యాలయం నుండి సర్కులర్ జారీ చేశారు

ఇవి కూడా చదవండి

ఐతే ఫోన్ చేసిన వ్యక్తి వ్యాపారుల పేరు.. ఆ షాప్ పేరు.. షాప్ నెంబర్ లైసెన్స్ అమౌంట్ వివరాలు కూడా చెప్తున్నారంటే కచ్చితంగా ఇందులో ఇంటి దొంగల పాత్ర ఉందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మున్సిపల్ కార్యాలయం పనిచేసే అధికారులు ఎవరో బినామీలను పెట్టుకొని ఇలాంటి వసూళ్లకు పాల్పడి ఉండాలి… లేదంటే ఎవరికైనా మున్సిపల్ కార్యాలయం సమాచారం చేరవేసి ఉండొచ్చని బావిస్తున్నారు. ఈ ఘటనపై మున్సిపల్ అధికారులు బాధిత వ్యాపారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.