RTC Bus Fire: మంటల్లో కాలి బూడిదైన ఆర్టీసీ బస్సు.. 25 మంది ప్రయాణికులు సేఫ్..

|

Jul 23, 2021 | 7:55 PM

జనగామ జిల్లాలో RTC సూపర్ లెగ్జరీ బస్సు నిట్టనిలువునా దగ్ధమైంది. హన్మకొండ నుండి హైదరాబాద్ వెళ్తున్న ఈ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. బస్సుకు వెనుక భాగంలో మంటలు...

RTC Bus Fire: మంటల్లో కాలి బూడిదైన ఆర్టీసీ బస్సు.. 25 మంది ప్రయాణికులు సేఫ్..
Bus Fire
Follow us on

జనగామ జిల్లాలో RTC సూపర్ లెగ్జరీ బస్సు నిట్టనిలువునా దగ్ధమైంది. హన్మకొండ నుండి హైదరాబాద్ వెళ్తున్న ఈ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. బస్సుకు వెనుక భాగంలో మంటలు అంటుకున్నాయి. మంటలు క్షణాల్లోనే బస్సును పూర్తిగా దహించివేశాయి. అటుగా వెళ్తున్న వాహనదారులు గుర్తించి డ్రైవర్‌ను అలర్ట్ చెయ్యడంతో ముప్పు తప్పింది.

జనగామ జిల్లాలో ఓ బస్సులో మంటలు చెలరగేగడంతో కాలి బూడిదైంది. హన్మకొండ నుండి హైదరాబాద్ వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. స్టేషన్ ఘన్పూర్ ప్రాంతంలో సూపర్ లగ్జరీ ఏసీ బస్సు వెనక భాగం నుండి ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. రోడ్డుపై వెళ్తున్న వాహనదారులు చూసి వెంటనే డ్రైవర్ ని అప్రమత్తం చేశారు.

దీంతో డ్రైవర్ బస్సును రోడ్డు ప్రక్కకు నిలిపివేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదం సమయంలో బస్సులో డ్రైవర్‌తో సహా 29 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే వెనుక వైపు నుంచి ఎందుకు మంటలు వచ్చాయనే కోణం పోలీసులు విచారణ జరుపుతున్నారు. బస్సులో ఏమైనా లగేజ్ ఉందా.. అది ఎవరిది.. అనేది ఎప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది.

ఇవి కూడా చదవండి: Telangana Politics 2023: తెలంగాణలో రాజకీయ రణం మొదలైందా.. ఈ పోరు ఆ దిశగానేనా..

 TTD – Anti Drone: తిరుమల కొండపై యాంటీ డ్రోన్ టెక్నాలజీ.. ఆలయ రక్షణలో డీఆర్‌డీవో సాంకేతికత

AP Inter Second Year Results 2021: ఏపీ ఇంటర్ సెకండియర్ ఫలితాలు విడుదల..