Warangal: నేడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించనున్న మంత్రి కేటీఆర్.. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన

|

Apr 20, 2022 | 5:46 AM

Warangal: రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ (Minister KTR) నేడు వరంగల్‌ జిల్లాలో పర్యటించనున్నారు.. రెండు జిల్లాల్లో పలు అభివృద్ధి పనులు, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు..

Warangal: నేడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించనున్న మంత్రి కేటీఆర్.. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
Minister Ktr
Follow us on

Warangal: రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ (Minister KTR) నేడు వరంగల్‌ జిల్లాలో పర్యటించనున్నారు.. రెండు జిల్లాల్లో పలు అభివృద్ధి పనులు, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అనంతరం హనుమకొండలో (Hanamkonda) జరిగే TRS పార్టీ ప్రతినిధుల సభలో పాల్గొంటారు.. కేటీఆర్ పర్యటన నేపథ్యంలో ఓరుగల్లు మొత్తం గులాబీ మాయమైంది.. మంత్రులు ఎర్రబెల్లి దయాకరరావు, సత్యవతి రాథోడ్, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ ఏర్పాట్లను పర్యవేక్షించారు..

TRS పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ – రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఈరోజు(బుధవారం) హనుమకొండ, వరంగల్‌ జిల్లాల్లో పర్యటించనున్నారు.. 213కోట్ల రూపాయల నిధుల చేపట్టిన పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేయనున్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేశారు. మంత్రులు ఎర్రబెల్లి దయాకరరావు, సత్యవతి రాథోడ్, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, MLAలు, MLCలు ఏర్పాట్లను పర్యవేక్షించారు.

బుధవారం ఉదయం హైదరాబాద్‌ నుంచి హెలికాప్టర్‌లో 9.15గంటలకు హనుమకొండలోని హార్ట్స్ కాలేజీకి మైదానానికి చేరుకుంటారు. అక్కడ నుంచి జీడబ్ల్యూఎంసీ ఆధ్వర్యంలో రూ.27.63 కోట్లతో చేపట్టిన అభివృద్ధి ప్రారంభోత్సవాలు, రూ.150.20కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేస్తారు. తర్వాత హెలికాప్టర్ ద్వారా నర్సంపేటకు చేరుకుంటారు. ఆ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. పైలట్ ప్రాజెక్టుగా నిర్మించిన ఇంటింటికీ గ్యాస్ కనెక్షన్ పథకాన్ని ప్రారంభిస్తారు.. మేఘా గ్యాస్ సంస్థ ఆధ్వర్యంలో ఈ పనులు చేపట్టారు.. ప్రత్యేక పైప్ లైన్ ద్వారా నేరుగా ఇంటికే గ్యాస్ సరఫరా అవుతుంది.. తెలంగాణ ప్రభుత్వం ఫైలట్ ప్రాజెక్టుగా నర్సంపేట లో దీనిని నిర్మించింది. నర్సంపేటలో ఈ కార్యక్రమం ముగిసిన అనంతరం అక్కడ జరిగే పబ్లిక్ మీటింగ్ లో పాల్గొంటారు.

నర్సంపేట పర్యటన తర్వాత హనుమకొండ కు చేరుకుంటారు.. హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు, అధికారులు, ప్రజాప్రతి నిధులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు..అనంతరం హాయగ్రీవచారీ మైదానంలో నిర్వహించే టీఆర్ఎస్ పార్టీ ప్రతినిధుల సభలో పాల్గొంటారు..

తిరుగు ప్రయాణంలో వరంగల్‌ ఎంట్రెన్స్‌ ఆర్చ్‌ను ప్రారంభించి హైదరాబాద్‌కు తిరిగి రోడ్డు మార్గంలో వెళ్తారు. అయితే కేటీఆర్ విపక్షాలకు ఇక్కడి నుండి దిమ్మతిరిగే కౌంటర్ ఇస్తారని గులాబీ శ్రేణులు భావిస్తున్నాయి..కేటీఆర్ రాక సందర్భంగా వరంగల్ నగరమంతా గులాబీమయం అయింది. కేటీఆర్ కు స్వాగతం పలికేందుకు భారీగా ప్లెక్సీలు, కటౌట్లు ఏర్పాటు చేశారు. అటు టీఆర్ఎస్ కార్యకర్తల్లో కొత్త జోష్ కనిపిస్తోంది.

Also Read: Steinway Tower: ప్రపంచంలో ఎత్తైన సన్నగా ఉండే బిల్డింగ్‌ ఇదే.. గాలి బలంగా వీస్తే ఎలా ఉంటుందంటే..!

Fire Accident: బేగంబజార్‌లో పేలిన ట్రాన్స్‌ఫార్మర్.. భారీ ఎత్తున మంటలు.. క్షణాల్లోనే దగ్ధమైన ఇన్నోవా..