
వరంగల్ కమిషనర్ పరిధిలో గత నాలుగు నెలలనుండి చైన్ స్నాచింగ్స్ లు కలకలం రేపాయి.. నగర శివారులో మహిళలు ఒంటరిగా వెళ్లాలంటే వనికిపోయే పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా మహిళా రైతులును టార్గెట్ చేసి వరస దోపిడీలతో హల్చల్ చేశారు. వరుస దోపిడీలు అంతర్ రాష్ట్ర దొంగలపని కావచ్చని అంతా భావించారు. కానీ పోలీసుల విచారణలో నీవ్వేరపోయే నిజాలు బయటపడ్డాయి. ఎట్టకేలకు ఆ చైన్ స్నాచర్‌ను పట్టుకున్న పోలీసులు అతని వద్ద నుంచి 250 గ్రాములపైగా బంగారు పుస్తెల తాళ్ళు, 3 బైక్స్ స్వాదీనం చేసుకొని రిమాండ్‌కు తరలించారు.
కాగా నిందితుడు హనుమకొండ జిల్లా ఎక్కతుర్తి మండలం దామెర గ్రామానికి చెందిన హరీష్‌గా పోలీసులు గుర్తించారు. ఇతను ఏడాది క్రితం యువతితో ప్రేమలో పడ్డాడని.. ఆమెను మెయింటైన్ చేయడానికి చేతిలో డబ్బు లేకపోవడంతో చైన్ స్నాచింగ్ చేయడం మొదలు పెట్టినట్టు పోలీసుల దర్యాప్తులో తెలింది. ఆ బంగారు గొలుసు తాకట్టుపెట్టి కొంత డబ్బు తీసుకొని ఆ డబ్బుతో జల్సాగా తిరిగాడని.. ఆ తర్వాత అతని ఆశ అత్యాశగా మారి.. ఇదేదో బాగుందనుకొని ఇదే వృత్తిగా ఎంచుకున్నాడని పోలీసులు తెలిపారు. నిందితుడు నాలుగు నెలల వ్యవధిలో మూడు బైక్‌లు దొంగలించి అవే బైక్స్ పై వెళ్లి చైన్ స్నాచింగ్స్‌కు పాల్పడ్డట్లు పోలీసులు తెలిపారు.
చైన్ స్నాచర్ హరీష్ ను అరెస్టు చేసిన పోలీసులు ఇతని వద్ద 237 గ్రాముల బంగారం, మూడు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు.. నిందితుడిని మీడియా ముందు హాజరు పరిచిన వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్. రిమాండ్‌కు తరలించారు.. ప్రేమ వ్యవహారమే ఇతని చైన్ స్నాచర్ గా మార్చిందని తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.