Telangana: బండి సంజయ్‌‌పై పెట్టిన కేసులు ఇవే.. బెయిల్ కూడా దొరక్కుండా..

|

Apr 05, 2023 | 1:29 PM

Bandi Sanjay Kumar: తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్‌ను ధృవీకరించారు వరంగల్ సీపీ రంగనాథ్. 10వ తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ, ఆ తర్వాత ప్రచారాల్లో బండి సంజయ్‌ హస్తం ఉందని తెలిపారు. వాటి ఆధారంగానే బండిపై మూడు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.

Telangana: బండి సంజయ్‌‌పై పెట్టిన కేసులు ఇవే.. బెయిల్ కూడా దొరక్కుండా..
Bandi Sanjay
Follow us on

తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్‌ను ధృవీకరించారు వరంగల్ సీపీ రంగనాథ్. 10వ తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ, ఆ తర్వాత ప్రచారాల్లో బండి సంజయ్‌ హస్తం ఉందని తెలిపారు. వాటి ఆధారంగానే బండిపై 5 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. 420, 120B, సెక్షన్ 5 ఆఫ్ మాల్‌ప్రాప్రాక్టీస్‌, సీఆర్‌పీసీ 154, 157  సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. పకడ్బందీగా నాన్‌బెయిలబుల్‌ కేసులు నమోదు చేశారు. మొత్తం వ్యవహారాన్ని 3గంటలకు మీడియా ముందు ఉంచనున్నారు సీపీ రంగనాథ్.

మంగళవారం అర్థరాత్రి 12 గంటల తరువాత కరీంనగర్‌లో బండి సంజయ్‌ని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే, ఆయన్ను ఎందుకు అరెస్ట్ చేశారు? ఏ కారణం చేత అరెస్ట్ చేశారు? ఏ సెక్షన్లు నమోదు చేశారు అనేది ఉత్కంఠగా మారింది. 10వ తరగతి ప్రశ్నపత్రం లీక్ కేసులోనే ఆయన్ను అరెస్ట్ చేసినట్లు మొదటి నుంచీ ప్రచారం జరిగింది. ఆ ప్రచారాన్ని సీపీ రంగనాథ్ ధృవీకరించారు. ప్రశ్నపత్రం లీక్ కేసులోనే ఆయన్ను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..