వేసిన తాళం వేసినట్టే ఉంది.. కానీ బీరువాలో దాచిన డబ్బంతా హాంఫట్.. చెక్ చేయగా

| Edited By: Ravi Kiran

Jul 30, 2024 | 1:41 PM

డబ్బు సంపాదనే ధ్యేయంగా.. ఈజీగా ఎలాగైనా సరే సంపాదించాలన్న ఉచ్చులో పడి ఆన్లైన్ బెట్టింగ్ గేమ్‌కు యువత అలవాటుపడి, ఆ గేమ్‌లలో డబ్బులు పోగొట్టుకొని అందులో నుంచి బయటికి రావడానికి ఎన్నో కష్టాలను పడుతూ కొందరు ప్రాణాలు వదులుతుంటే..

వేసిన తాళం వేసినట్టే ఉంది.. కానీ బీరువాలో దాచిన డబ్బంతా హాంఫట్.. చెక్ చేయగా
Sangareddy
Follow us on

డబ్బు సంపాదనే ధ్యేయంగా.. ఈజీగా ఎలాగైనా సరే సంపాదించాలన్న ఉచ్చులో పడి ఆన్లైన్ బెట్టింగ్ గేమ్‌కు యువత అలవాటుపడి, ఆ గేమ్‌లలో డబ్బులు పోగొట్టుకొని అందులో నుంచి బయటికి రావడానికి ఎన్నో కష్టాలను పడుతూ కొందరు ప్రాణాలు వదులుతుంటే, మరికొందరు తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. అదే ఆన్లైన్ బెట్టింగ్‌లకు వ్యసనంగా మారి ఏకంగా ఒక బాధ్యత గల వ్యక్తి దొంగతనానికి పాల్పడి కటకటాలు లెక్కబెడుతున్నాడు. ఇప్పుడు ఇది సంగారెడ్డి జిల్లాలో చర్చనీయాంశమైంది.

రేకోడ్ మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన జ్ఞానేశ్వర్ సిద్దిపేట జిల్లా చేర్యాలలో వీఆర్ఏగా పనిచేస్తున్నాడు. ఇతను ఆన్లైన్‌లో బెట్టింగ్ ఆడుతూ ఇప్పటికే ఎన్నో డబ్బులు పోగొట్టుకున్నాడు. వెంకటాపూర్ గ్రామానికి చెందిన సంగప్ప అనే రైతు తన వ్యవసాయ పెట్టుబడి అవసరాల కోసం రెండు లక్షల పదివేల రూపాయలను, రెండు గ్రాముల బంగారాన్ని తన ఇంటిలో దాచి పెట్టుకున్నాడు. ఈ నెల 22వ తేదీన తన భార్యతో కలిసి వేరే గ్రామానికి బయలుదేరి వెళ్లాడు. ఇదే అదునుగా భావించిన జ్ఞానేశ్వర్ సంగప్ప ఇంట్లోకి చొరబడి రెండు గ్రాముల బంగారాన్ని, రెండు లక్షల పదివేల రూపాయల నగదును చోరీ చేసి.. తిరిగి బెట్టింగ్‌లో పెట్టుబడి పెట్టాడు. తర్వాత రోజు వచ్చిన రైతు సంగప్ప తన పనిలో తాను ఉన్నాడు. విత్తనాల కోసం నగదును తీసుకునే క్రమంలో తమ ఇంట్లో దొంగలు పడ్డారని గుర్తించాడు. వెంటనే పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. జ్ఞానేశ్వర్‌పై అనుమానం వచ్చిన పోలీసులు తమదైన శైలిలో విచారించగా.. తాను ఆన్లైన్ బెట్టింగ్ యాప్‌లో డబ్బులు పోగొట్టుకున్నానని.. తిరిగి వాటిని సంపాదించడానికి దొంగతనం చేశానని నిందితుడు ఒప్పుకోవడంతో.. జ్ఞానేశ్వర్‌ని రిమాండ్ తరలించారు. అతడి దగ్గరున్న నగదు, బంగారాన్ని రికవరీ చేశారు పోలీసులు.