BRS MLA: సొంత గూటికి చేరిన గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్
కాంగ్రెస్‌కు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి షాక్ ఇచ్చారు. తిరిగి బీఆర్‌ఎస్ గూటివైపే ఆయన అడుగులు పడుతున్నాయి. ఇవాళ అసెంబ్లీలో కేటీఆర్‌తో సమావేశమయ్యారు కృష్ణమోహన్ రెడ్డి. ఈ నెల 6న కాంగ్రెస్‌లో చేరిన కృష్ణ మోహన్ ఇప్పుడు దాన్ని ఖండిస్తున్నారు. తాను ఇప్పటికే బీఆర్‌ఎస్‌లోనే ఉన్నానని,..
కాంగ్రెస్‌కు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి షాక్ ఇచ్చారు. తిరిగి బీఆర్‌ఎస్ గూటివైపే ఆయన అడుగులు పడుతున్నాయి. ఇవాళ అసెంబ్లీలో కేటీఆర్‌తో సమావేశమయ్యారు కృష్ణమోహన్ రెడ్డి. ఈ నెల 6న కాంగ్రెస్‌లో చేరిన కృష్ణ మోహన్ ఇప్పుడు దాన్ని ఖండిస్తున్నారు. తాను ఇప్పటికే బీఆర్‌ఎస్‌లోనే ఉన్నానని, పార్టీ మారలేదని స్పష్టం చేస్తున్నారు. తాను కాంగ్రెస్ కండువా కప్పుకోలేదని, ఆరోజు తన మెడలో ఉన్నది దేవుడి గుడికి సంబంధించిన కండువా అని కొత్త వాదన వినిపించారు. త్వరలోనే తాను కేసీఆర్‌ను కూడా కలుస్తానని చెప్తున్నారు. పార్టీ మారిన కృష్ణమోహన్‌రెడ్డి ఎందుకు యూటర్న్ తీసుకున్నారు.. నియోజకవర్గంలో కాంగ్రెస్ శ్రేణులతో ఆయన వర్గం కలుపుకుని వెళ్లడంలో ఏమైనా ఇబ్బంది వచ్చిందా.. మరేదైనా కారణమా అనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది.
పొదుపు చేయలేదు.. జాబ్ పోయింది.. టెకీ ఆవేదన
ప్రాణాలకు తెగించి వృద్ధ దంపతుల వీరోచిత పోరాటం
మెస్సికి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన అనంత్ అంబానీ..
నీరు తోడుతుండగా వచ్చింది చూసి.. పరుగో పరుగు..
జోరు వానలో చిక్కుకున్న ఏనుగు.. గొడుగుగా మారిన తల్లి ఏనుగు..
6 నెలలు చికెన్ మాత్రమే తిన్న యువతి.. చివరకు ఆస్పత్రిలో చేరి..
తవ్వకాల్లో బయటపడ్డ దుర్గమాత విగ్రహం

