Telangana Crime: మహిళపై వీఆర్ఏ అత్యాచారాయత్నం.. అడ్డొచ్చిన భర్త చేతివేళ్లు కొరికి

|

Mar 19, 2022 | 6:49 PM

సమాజంలో రోజురోజుకు మనుషుల్లో నేర (Crime) ప్రవృత్తి పెరిగిపోతోంది. క్షణికావేశంలో దారుణాలకు పాల్పడుతున్నారు. కన్నుమిన్ను ఎరగకుండా దురాగాతాలకు ఒడిగడుతూనే ఉన్నారు. ఇలాంటి ఘటనల మీద కేసులు నమోదు...

Telangana Crime: మహిళపై వీఆర్ఏ అత్యాచారాయత్నం.. అడ్డొచ్చిన భర్త చేతివేళ్లు కొరికి
Student Harassment
Follow us on

సమాజంలో రోజురోజుకు మనుషుల్లో నేర (Crime) ప్రవృత్తి పెరిగిపోతోంది. క్షణికావేశంలో దారుణాలకు పాల్పడుతున్నారు. కన్నుమిన్ను ఎరగకుండా దురాగాతాలకు ఒడిగడుతూనే ఉన్నారు. ఇలాంటి ఘటనల మీద కేసులు నమోదు చేసి, కఠిన శిక్షలు అమలు చేస్తున్నా నిత్యం ఏదో ఒకచోట ఇలాంటి ఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. తాజాగా వరంగల్ (Warangal) జిల్లాలో ఓ దుర్ఘటన జరిగింది. గౌరవమైన ప్రభుత్వ రంగంలో ఉద్యోగం చేసుకుంటున్న ఓ వ్యక్తి.. మహిళపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు. పొలాల్లోకి లాక్కెళ్లి.. అత్యాచారయత్నం చేశారు. మహిళ గట్టిగా కేకలు వేయడంతో ఆమెను కాపాడేందుకు భర్త వెళ్లాడు. దీంతో బాధితురాలి భర్త మీద దాడి చేసిన నిందితుడు.. అతడిని తీవ్రంగా గాయపర్చి, అక్కడి నుంచి పరారయ్యాడు.

తెలంగాణలో(Telangana) ని వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన శ్రీనివాస్ గ్రామ శివారులో బిర్యానీ హోటల్ నిర్వహిస్తున్నాడు. శుక్రవారం రాత్రి 9 గంటల సమయంలో అదే గ్రామంలో వీఆర్ఏగా పనిచేస్తున్న అశోక్ అనే వ్యక్తి వచ్చాడు. అక్కడే ఉన్న శ్రీనివాస్ భార్యతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఆమెపై లైంగిక దాడి చేయాలని భావించాడు. బాధితురాలి చేయి పట్టుకుని పొలాల్లోకి లాక్కెళ్లాడు. అడ్డుకోబోయిన శ్రీనివాస్ చేతి వేళ్లను కొరికి పారిపోయాడు. ఇద్దరి మధ్య తీవ్ర గొడవ జరిగింది. అదే క్రమంలో శ్రీనివాస్ చేతివేలు తెగిపడేలా కొరికిన అశోక్.. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. బాధితురాలి కుటుంబ సభ్యులు వెంటనే పోలీస్ స్టేషన్‌‌కి వెళ్లి ఫిర్యాదు చేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితురాలి భర్తను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Also Read

Telangana Jobs: తెలంగాణ సచివాలయంలో 250 అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే..

CM KCR: అందుబాటులో ఉన్న మంత్రులతో సీఎం కేసీఆర్ అత్యవసర భేటీ.. ఫాంహౌజ్‌లో కీలక మంతనాలు!

MS Dhoni vs Gambhir: ‘ధోనీకి అండగా నిలిచే మొదటి వ్యక్తిని నేనే.. మా మధ్య ఎలాంటి విభేదాలు లేవు’