
ఈ మధ్య కాలంలో బోరు వేసేందుకు రైతులు నానా తంటాలు పడుతున్నారు. ఎక్కడ బోరు వేసినా, వందల ఫీట్లు నేలను తవ్వినా నీళ్లు పడక, అవస్థలు పడుతున్నారు. కానీ ఇక్కడో రైతును మాత్రం అదృష్టం వరించింది. బోరు బావిలోకి లాంటి మోటర్ దించకుండానే ఆ గంగమ్మ తల్లి పైకి ఉబికి వస్తుంది. ఈ ఘటన స్థానికంగా అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇది కూడా చదవండి: ఆర్టీసీ కండక్టర్‌పై ప్రయాణికురాలి దాడి.. కారణం తెలిస్తే అవాకవ్వాల్సిందే!
వివరాల్లోకి వెళ్తే.. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం నందనం గ్రామంలో గ్రామ పంచాయతీ అధికారులు మంచినీటి కోసం బోరు వేశారు. కొంతకాలం పాటు గ్రామానికి మంచినీరు అందించిన బోరుబావి వట్టిపోయింది. భూగర్భ జలాలు అడుగంటి బోరుబావి నిరుపయోగంగా ఉంది. కాగా ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఎలాంటి విద్యుత్ మోటర్ లేకుండానే పాతాళ గంగ బోరు బావి నుంచి పైకి ఉబికి వస్తోంది. పాతాళ గంగ పైకి ఊబికి వస్తుండడంతో.. ఆశ్చర్యపోయిన గ్రామస్తులు ఈ వింతను చూసేందుకు క్యూ కట్టారు.
ఇది కూడా చదవండి: ప్రపంచంలోనే అత్యంత దురదృష్టకర పాము ఇదేనట.. ఎందుకో తెలుసా?
గత కొన్ని రోజులుగా బావుల్లో, బోరు బావుల్లో భూగర్భ జలాలు క అడుగంటాయని, ఇటీవల వర్షాలు భారీగా కురవడంతో భూగర్భ జలాలు పైకి వస్తున్నాయని భూగర్భ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇటీవల వర్షాలకు గ్రామాల్లోని కుంటలు, చెరువు నిండటం పట్ల రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
వీడియో చూడండి..
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.