కేంద్రీయ విద్యాలయాల్లోని ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయాలి… రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్

రాష్ట్రంలోని కేంద్రీయ విద్యాలయాల్లోని ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయాల‌ని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్...

కేంద్రీయ విద్యాలయాల్లోని ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయాలి... రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్
చిన్న సవరణ చేస్తే చాలు.. పని అయిపోతుందని, గతంలోనే ఈ మార్పు చేయాలని తాను సూచించిన.. పట్టించుకోలేదంటున్నారు తెలంగాణ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్.
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jan 18, 2021 | 9:39 AM

Vinod Kumar Letter To Central Minister: రాష్ట్రంలోని కేంద్రీయ విద్యాలయాల్లోని ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయాల‌ని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ కోరారు. ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్‌కు వినోద్‌కుమార్‌ లేఖ రాశారు. విద్యార్థుల తల్లిదండ్రులు ద్వారా విద్యాలయాల్లో ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్న విషయం తన దృష్టికి వ‌చ్చింద‌ని పేర్కొన్నారు. రాష్ట్రంలోని 35 కేంద్రీయ విద్యాలయాల్లో ఉన్న 1,218 పోస్టుల్లో ఇంకా 128 ఖాళీలు భర్తీ చేయాల్సి ఉందని తెలిపారు. ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉండటంతో విద్యార్థులకు విద్యా బోధన సాగడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని లేఖలో వివరించారు. అలాగే రాష్ట్రంలోని కేంద్రీయ‌ విద్యాల‌యాల ప్రతిపాదనలను పరిశీలించాలని కోరారు.

Also Read: Clashes: ఉప్పర్‌‌పల్లిలో తీవ్ర ఉద్రిక్తత.. ప్రహరీ విషయంలో ఇరు కుటుంబాల మధ్య ఘర్షణ.. తీవ్రంగా గాయపడిన వ్యక్తి..