Telangana: మద్యం మత్తులో గొడవలు.. ఆదర్శంగా నిలిచిన గ్రామస్థుల నిర్ణయం..

మద్యం వల్ల ఎన్నో కుటుంబాలు రోడ్డునపడ్డాయి. ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలో ఓ గ్రామ ప్రజలు సంచలన నిర్ణయం తీసుకున్నారు. తమ గ్రామంలో మద్యం గొడవలు జరగకూడదని ఓ తీర్మానం చేశారు. ఆ తీర్మానాన్ని అతిక్రమిస్తే తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Telangana: మద్యం మత్తులో గొడవలు.. ఆదర్శంగా నిలిచిన గ్రామస్థుల నిర్ణయం..
Liquor

Edited By: Krishna S

Updated on: Jul 18, 2025 | 8:01 PM

రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతుంది. ఈ మత్తు వల్ల ఎన్నో కుటుంబాలు చిత్తయ్యాయి. ఇంకా అవుతూనే ఉన్నాయి. గ్రామాలలో మద్యం ఏరులై పారుతుండడంతో యువత మద్యానికి బానిస అవుతున్నారు. దీంతో ఎన్నో కుటుంబాలు నాశనమవుతున్నాయి. తాగిన మైకంలో వావివరసలు మరిచి అఘాయిత్యాలు, హత్యలకు పాల్పడుతున్నారు. ఎంత చెప్పిన తాగేవారిలో మాత్రం ఎటువంటి మార్పు రావడం లేదు. ఈ క్రమంలోనే ఓ గ్రామం ఆదర్శంగా నిలిచింది. ఊరి బాగు కోసం గ్రామస్తులంతా ఏకతాటిపైకి వచ్చారు. గ్రామంలో మద్యాన్ని నిషేధిస్తూ తీర్మానం చేశారు. ఆ గ్రామస్థుల నిర్ణయాన్ని అంతా ప్రశంసిస్తున్నారు.

సిద్దిపేట జిల్లా తోగుట మండలం పెద్దమసాన్ పల్లి గ్రామంలో ఈ మధ్య గొడవులు ఎక్కువగా జరుగుతున్నాయి. మొన్నటికి మొన్న ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అల్లుడు అత్తను చంపాడు. ఇది మద్యం మత్తులోనే చేశాడు. పలు రోడ్డు ప్రమాదాలు కూడా చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో గొడవలన్నింటికి కారణం మందు అని గ్రామస్థులు నిర్ధారించుకున్నారు. దాంతో గ్రామంలో మద్య నిషేధం విధించాలని మహిళలు, యువత పట్టుబట్టారు. అటు గ్రామస్థులు సైతం వారికి మద్ధతుగా నిలిచారు. అంతా కలిసి గ్రామ పంచాయతీ వద్ద మద్య నిషేధం అమలుచేస్తూ తీర్మానం చేశారు. యువత గ్రామంలో డబ్బు చప్పులతో ఊరేగింపు చేపట్టి.. మద్యనిషేధంపై అవగాహన కల్పించారు. గ్రామంలో ఇకపై మద్యం ఎవరైన అమ్మితే తగిన చర్యలు తీసుకుంటామని గ్రామ పెద్దలు హెచ్చరించారు. ఇలా ఈ గ్రామస్తులు తీసుకున్న నిర్ణయం చుట్టు పక్కల గ్రామాల వారిని కూడా ఆలోచనలో పడేలా చేసింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..