Vikarabad SI and His father was killed: నూతన సంవత్సరం తొలి రోజున రహదారులు రక్తమోడుతున్నాయి. తెలంగాణలోని నల్లగొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సు, ఆటో ఢికొన్న ఘటనలో వికారాబాద్ ఎస్ఐ శ్రీను నాయక్ (32) సహా ఆయన తండ్రి మాన్య నాయక్ మృతిచెందాడు. ఈ ఘోర రోడ్డు ప్రమాదం చింతపల్లి మండలం పోలేపల్లి రాంనగర్ వద్ద జరిగింది. రాంనగర్ వద్ద ఆర్టీసీ బస్సు ఆటో ఢీకొన్నాయి. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరు మృతి చెందగా.. ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మృతుల్లో వికారాబాద్ ఎస్సై శ్రీను నాయక్, ఆయన తండ్రి ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
కాగా.. ఎస్ఐ శ్రీను నాయక్ (డిసెంబర్ 26) వారం రోజుల క్రితమే వివాహం చేసుకున్నారు. ఎస్సై శ్రీను నాయక్ స్వస్థలం రంగారెడ్డి జిల్లా మాడుగుల మండలం మాన్య తండా. హైదరాబాద్ నుంచి దేవరకొండకు వెళుతున్న బస్సు ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు పేర్కొన్నారు.
ప్రమాదం జరిగిన సమయంలో శ్రీను నాయక్ ఆటో నడిపినట్లు పేర్కొంటున్నారు. అత్తారింటి దగ్గర ఒడిబియ్యం కార్యక్రమం ముగించుకొని వస్తుండగా ఈ ఘటన జరిగింది. ఇటీవల తండ్రి చేతికి గాయమవ్వగా.. ఎస్ఐ ఆటో నడిపినట్లు పేర్కొంటున్నారు. కాగా.. ఈ ఘటనతో ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.
Also Read: