కొత్త సంవత్సరం వేళ సామాన్యులకు భారీ షాక్ తగిలింది. విజయపాల ధరలు పెరిగాయి. పాల లీటర్ పై రూ. 2 పెరిగింది. అంతేకాకుండా.. హోల్ మిల్క్ పై రూ. 4 పెరిగింది. పెరిగిన ధరలు శనివారం నుంచి అమలు కానున్నాయని తెలంగాణ రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సంస్థ జనరల్ మేనేజర్ వి. మల్లికార్జునరావు తెలిపారు. పెరిగిన పాల ధరలకు అటు వినియోగదారులు కూడా సహకరించాలని ఆయన కోరారు.
రోజు రోజుకీ పెరుగుతున్న నిత్యావసరాల ధరలు సామాన్యులకు భారంగా మారాయి. కూరగాయాల నుంచి వంటనూనె ధరలు.. పప్పు దినుసుల ధరలు ఆకాశాన్ని చాటుతున్నాయి. ఈ క్రమంలో కొత్త సంవత్సరం నుంచి రోజూవారీ వినియోగంలో ముఖ్యమైన పాల ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది తెలంగాణ రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ధి. పెరిగన పాల ధరలు ఈరోజు నుంచి అమలలోకి రానున్నాయి. ఈ క్రమంలో పెరిగిన పాల ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందామా.
☛ డబుల్ టోన్డ్ పాల రకం 200 మిల్లీ లీటర్ల (మి.లీ) ప్యాకెట్ ధర రూ.9 ఉండగా.. దానిని రూ.9.50కి పెంచారు. అలాగే 300 మి.లీ.ప్యాకెట్ ధర రూ.14 నుంచి రూ. 15కు చేరింది. 500 మి.లీ. ప్యాకెట్ ధర రూ.22 నుంచి రూ.23కి పెరిగింది.
☛ ఆవుపాలు 500 మి.లీ. ప్యాకెట్ ధర రూ. 24 నుంచి రూ.25కు పెరిగింది. ఇక టోన్డ్ పాలు 500 మి.లీ. ప్యాకెట్ ధర రూ. 10 నుంచి రూ. 10.50కు.. 500 మి.లీ. ధర రూ. 24 నుంచి రూ.25కు చేరింది. ఇక లీటరు ధర రూ. 47 నుంచి రూ. 49కి చేరింది. ఆరు లీటర్ల ధర రూ. 276 నుంచి రూ. 288కి చేరింది.
☛ స్టాండర్ డైజ్డ్ పాలు 500 మి.లీ. ప్యాకెట్ ధర రూ.26 నుంచి రూ. 27కి పెరిగింది. హోల్ మిల్క్ 500 మి.లీ. ప్యాకెట్ ధర రూ. 31 నుంచి రూ.33, డైట్ పాలు 500 మి.లీ. ప్యాకెట్ ధర రూ. 21 నుంచి రూ. 22కు పెరిగిందియ
☛ టీ స్పెషల్ 500 మి.లీ. ప్యాకెట్ ధర రూ. 23 నుంచి రూ. 24కు చేరింది.
Also Read: Viral Photo: బ్యాట్ పట్టుకున్న ఈ చిన్నది ఇప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా!
Hero Nani: నిర్మాత కోసం నేచురల్ నాని డేరింగ్ స్టెప్.. రెమ్యునరేషన్‌ని వెనక్కి ఇచ్చేశాడంటూ టాక్..