పొలంలో బయటపడ్డ వర్థమాన్ మహావీర్ విగ్రహం..

తొలకరి వానలు కురుస్తుండటంతో రైతులంతా పొలం పనుల్లో మునిగిపోయారు. ఈ క్రమంలోనే ఓ రైతు తన పొలం దున్నుతండగా వర్థమాన మహావీర్ పురాతన విగ్రహం బయటపడింది. వివరాల్లోకి వెళ్తే.. తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు పడుతుండటంతో కరీంనగర్‌లోని గంగాధర మండలంలో కోట్ల నర్సింహులపల్లి గ్రామానికి....

పొలంలో బయటపడ్డ వర్థమాన్ మహావీర్ విగ్రహం..

Edited By:

Updated on: Jun 13, 2020 | 6:54 PM

తొలకరి వానలు కురుస్తుండటంతో రైతులంతా పొలం పనుల్లో మునిగిపోయారు. ఈ క్రమంలోనే ఓ రైతు తన పొలం దున్నుతుండగా వర్థమాన మహావీర్ పురాతన విగ్రహం బయటపడింది. వివరాల్లోకి వెళ్తే.. తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు పడుతుండటంతో కరీంనగర్‌లోని గంగాధర మండలంలో కోట్ల నర్సింహులపల్లి గ్రామానికి చెందిన ఒగ్గు అంజయ్య అనే రైతు తన పొలంలో పంటలు వేయడానికి ట్రాక్టర్ దున్నడం ప్రారంభించాడు. సరిగ్గా అదే సమయానికి పొలంలో జైన తీర్థంకరుడైన వర్థమాన మహావీరుడి విగ్రహం లభించింది. దాన్ని గమనించన అంజయ్య వెంటనే గ్రామ సర్పంచ్‌కి సమాచారం అందించాడు. దీంతో వెంటనే గ్రామ సర్పంచ్ కవిత, గ్రామస్తులు అక్కడికి చేరుకుని మహావీర్ విగ్రహానికి పూజలు నిర్వహించారు. అనంతరం పురావస్తు శాఖకు సమాచారం అందించారు. కాగా రెండేళ్ల క్రితం ఇదే భూమిలో జైన తీర్థకరుడు పార్శనాథుని విగ్రహం లభించిందని పొలం యజమాని అంజయ్య వెల్లడించాడు. దీంతో పురావస్తు వాఖ అధికారులు ఆ పంట పొలాన్ని పరిశీలిస్తున్నారు.

Read more: ఏపీలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు.. రంగం సిద్ధం