2022 New Year: మొక్కలు నాటిన వనజీవి రామయ్య.. కొత్త ఏడాదికి మొక్కలు నాటి స్వాగతం పలకాలని పిలుపు

|

Dec 31, 2021 | 6:15 PM

2022 New Year: నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరు ఒక మొక్క నాటి పర్యావరణ పరిరక్షకులు కావాలని వనజీవి రామయ్య కోరారు. మొక్కలు సమాజానికి ప్రాణాలని, మానవ మనుగడకు..

2022 New Year: మొక్కలు నాటిన వనజీవి రామయ్య.. కొత్త ఏడాదికి మొక్కలు నాటి స్వాగతం పలకాలని పిలుపు
Vanajeevi Ramayya
Follow us on

2022 New Year: నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరు ఒక మొక్క నాటి పర్యావరణ పరిరక్షకులు కావాలని వనజీవి రామయ్య కోరారు. మొక్కలు సమాజానికి ప్రాణాలని, మానవ మనుగడకు చెట్లే జీవనాధారాలని అన్నారు. చెట్లు లేకుంటే జీవన పరిణామక్రమం ఆగిపోతుందన్నారు. శుక్రవారం వనజీవి రామయ్య రవీంధ్రభారతిలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా మొక్క నాటారు. యువతరం మొక్కలు నాటే కార్యక్రమంలో చురుకుగా పాల్గొనటం చూస్తుంటే ఆనందం కలుగుతుందని తెలిపారు.

వనజీవి రామయ్యగా జీవితాంతం మొక్కలు నాటే కార్యక్రమానికి ఇప్పుడు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ దాన్ని మహోద్యమం చేసిందన్నారు. నాకు జీవితంలో ఇంతకంటే ఆనందం ఏముంటుందని పేర్కొన్నారు. తెలంగాణ వచ్చాక మొక్కలు నాటటం ఉద్యమంగా మారటం మొత్తం సమాజమంతా గర్వించేదని వనజీవి రామయ్య అన్నారు. ఈ కార్యక్రమంలో వనజీవి రామయ్య సతీమణి జానకమ్మ, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపక సభ్యులు ఎస్. రాఘవేంద్ర యాదవ్, తెలంగాణ సాహిత్య అకాడమి ఛైర్మన్ జూలూరు గౌరీశంకర్, డిఎస్పి కృష్ణయ్య, మాజీ సైనికోద్యోగి, నటుడు ప్రభంజన్ అలియాస్ వెంకట అప్పారావు  తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వనజీవి రామయ్య కేంద్ర సాహిత్య అకాడమి అవార్డు గ్రహీతలు గోరటి వెంకన్న, దేవరాజు మహారాజు, సాహిత్య అకాడమి ఛైర్మన్ జూలూరు గౌరీశంకర్లకు మొక్కలు నాటమని ఛాలెంజ్ చేశారు.

 

Also Read:  కొత్త ఏడాది ఈ 4రాశుల ఉద్యోగులకు ఆర్ధికంగా శుభవార్తని తెస్తుంది.. అందులో మీరున్నారా..