Vanajeevi Ramaiah:ఖమ్మం జిల్లా రెడ్డిపల్లి గ్రామానికి చెందిన వనజీవి రామయ్య మొక్కల పెంపకంతో వనజీవి రామయ్య గా ఖ్యాతిగాంచారు. పద్మశ్రీ అవార్డ్ గ్రహీత, ప్రకృతి ప్రేమికుడు వనజీవి రామయ్య ఐసీయూలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఈరోజు వనజీవి రామయ్యను వైద్యులు డిశ్ఛార్జి చేశారు. ఆస్తమా, గుండె, ఊపిరితిత్తుల సమస్యలతో వనజీవి బాధపడుతున్నారని వైద్య సిబ్బంది చెప్పారు. రామయ్యకు అన్ని పరీక్షలు చేసి.. మందులు రాసి ఇచ్చి ఇంటికి పంపించారు. ఆయన ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని ఆందోళన చెందాల్సిన పని లేదని తెలిపారు. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా విశ్రాంతి తీసుకోవాలని రామయ్యకు వైద్యులు సూచించారు.
ఈ ఏడాది ఫిబ్రవరిలోనూ శ్వాస తీసుకోవడంలో ఇబ్బందికి గురై ఆసుపత్రిలో చేరిన రామయ్య అనంతరం కోలుకున్నారు. గత 50ఏళ్ల నుంచి మొక్కలను నాటుతూ పర్యావరణ పరిరక్షణ కోసం పాటుపడుతున్నారు. .. ఇప్పటి వరకు 3కోట్ల మొక్కలను నాటారు. మొక్కలను చంటి పిల్లలా పెంచుతూ.. పర్యావరణ పరిరక్షణ కోసం విశేషంగా కృషి చేస్తున్నారు. ఇందుకుగానూ కేంద్ర ప్రభుత్వం పద్మ శ్రీ పురస్కారం అందజేసింది. తెలంగాణ ప్రభుత్వం కూడా ఆయనను గౌరవించింది. అంతేకాదు 6 వ తరగతి పాఠాలలో వనజీవి రామయ్య జీవిత కథ గా చేర్చింది.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమం ఆయన స్ఫూర్తితోనే తీసుకోవడం విశేషం.
రామయ్య 83 సంవత్సరాల వయస్సులోనూ అడవుల వెంట తిరుగుతూ వివిధ రకాల విత్తనాలను సేకరించి, మొక్కలు పెంచి, పదిమందికి పంచుతుంటారు. వేసవి వచ్చిందంటే వీరు అడవులు తిరుగుతూ రకరకాల విత్తనాలు సేకరిస్తుంటారు. వాటన్నింటిని బస్తాల్లో నింపి ఇంటి దగ్గర నిల్వచేస్తారు. ఎవరికీ తెలియని చెట్ల పేర్లు, . తొలకరి చినుకులు పడగానే మొక్కలు నాటే కార్యక్రమంలో మునిగిపోతారు. రోడ్లకు ఇరువైపులా, చెరువు కట్టల వెంట, జాతరలు, ఖాళీ జాగాల్లో, ఎక్కడ ఖాళీ ప్లేస్ కనిపిస్తే అక్కడ గింజలు నాటుతాడు. తొలకరి చినుకులు పడగానే ఆ గింజలను నాటేపని ప్రారంభిస్తారు. ఈ మొక్కలను పది మందికీ పంచి హరితహారం ఏర్పాటు చేస్తున్నారు. ఆయన యువతరం నుంచి నాటిన మొక్కలు నేడు మహావృక్షాలుగా దర్శనమిస్తున్నాయి.
Also Read: బార్క్ వచ్చిన తర్వాత అత్యధిక టీఆర్ఫీ రేటింగ్ ను సొంతం చేసుకున్న టాప్ 10 సినిమాలు ఏమిటో తెలుసా