BJP Praja Sangrama Yatra: ఆ సమయం వచ్చేసింది.. టీఆర్ఎస్‌పై సంచలన కామెంట్స్ చేసిన స్మృతి ఇరానీ..

|

Oct 02, 2021 | 6:38 PM

BJP Praja Sangrama Yatra: తెలంగాణలో అవినీతి ప్రభుత్వాన్ని అంతం చేయాల్సిన సమయం ఆసన్నమైందని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ అన్నారు.

BJP Praja Sangrama Yatra: ఆ సమయం వచ్చేసింది.. టీఆర్ఎస్‌పై సంచలన కామెంట్స్ చేసిన స్మృతి ఇరానీ..
Smriti Irani
Follow us on

BJP Praja Sangrama Yatra: తెలంగాణలో అవినీతి ప్రభుత్వాన్ని అంతం చేయాల్సిన సమయం ఆసన్నమైందని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ అన్నారు. శనివారం నాడు.. హుస్నాబాద్‌లో బీజేపీ నిర్వహించి నిర్వహించిన ‘ప్రజా సంగ్రామ యాత్ర’ తొలిదశ ముగింపు సభలో స్మృతి ఇరానీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసంగించిన ఆయన.. 438 కిలోమీటర్ల మేర దిగ్విజయంగా పాదయాత్ర చేసిన బండి సంజయ్‌ని ప్రత్యేకంగా అభినందిస్తున్నానని అన్నారు. ‘నీళ్లు-నిధులు-నియామకాలు’ ట్యాగ్ లైన్‌తోనే తెలంగాణ ఉద్యమం మొదలైందని, ఆ లక్ష్యంతోనే తెలంగాణ సిద్ధించిందని స్మృతి ఇరానీ పేర్కొన్నారు. అయితే, టీఆర్ఎస్ పాలనలో ‘నీళ్లు-నిధులు-నియామకాలు’ ఏమీ లేవన్నారు. నిరుద్యోగ సమస్య అలాగే ఉందన్నారు. ‘నీళ్లు-నిధులు-నియామకాలు’ అన్నీ కూడా కేసీఆర్ కుటుంబానికే దక్కాయని విమర్శించారు.

రామగుండం ఫెర్టిలైజర్ ఫ్యాక్టరీని పునరుద్ధరించిన ఘటన ప్రధాని నరేంద్ర మోదీనే అని అన్నారు. కరోనా సంక్షోభ సమయంలో దేశ వ్యాప్తంగా 80 కోట్ల మంది పేదలకు రేషన్ ఇచ్చిన ఘనత కూడా మోడీదే అని అన్నారు. తెలంగాణలో కేసీఆర్ ఇచ్చిన హామీలలో ఏ ఒక్కటీ నెరవేర్చలేదని విమర్శలు గుప్పించారు. ఎన్నికల వేళ ఇచ్చిన రూ. 3 వేల నిరుద్యోగ భృతి ఏమైందని కేసీఆర్‌ను కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ప్రశ్నించారు. ‘తెలంగాణ విమోచన దినోత్సవాన్ని’ అధికారికంగా ఎందుకు నిర్వహించడం లేదని నిలదీశారు. 2 కోట్ల మంది పేదలకు మోదీ డబుల్ బెడ్‌ రూమ్ ఇళ్లు ఇస్తే.. తెలంగాణలో కేసీఆర్ ఎన్ని డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇచ్చారో సమాధానం చెప్పాలని డిమాండ్ చఏశారు. దేశంలో ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారన్న కేంద్ర మంత్రి.. తెలంగాణలో ఫసల్ భీమా యోజన పథకాన్ని అమలు చేయడం లేదని విమర్శించారు. టీఆర్ఎస్‌ ప్రభుత్వ స్టీరింగ్ ఎంఐఎం చెతిలో ఉందన్నారు. దళితులకు టీఆర్ఎస్ ప్రభుత్వం మొండి చెయ్యి చూపిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజల స్వప్నాన్ని నెరవేర్చేది కేవలం బీజేపీనే అని ఉద్ఘాటించారు. బీజేపీకి ప్రజలు మద్ధతు ఇవ్వాలని ఆమె విజ్ఞప్తి చేశారు. బండి సంజయ్ పాదయాత్ర రాష్ట్రంలో పెను మార్పును తీసుకువస్తుందని అన్నారు.

ఇదిలాఉంటే.. బహిరంగ సభకు ముందు.. తిరుమల గార్డెన్స్ నుంచి బండి సంజయ్ పాదయాత్ర మొదలైంది. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీతో కలిసి ప్రచార రథం ఎక్కి హుస్నాబాద్‌లో రోడ్ షో నిర్వహించారు. అంబేద్కర్ సర్కిల్ వరకు ప్రజలకు అభివాదం చేస్తూ బండి సంజయ్ రోడ్ షో కొనసాగింది. ఈ రోడ్ షో నేపథ్యంలో హుస్నాబాద్ పట్టణం జనసంద్రమైంది.

Also read:

Samantha- Naga Chaitanya Divorce: సమంత చైతన్య విడాకుల పై నాగార్జున ఎమోషనల్ రియాక్షన్.. హృదయం బరువెక్కిందంటూ..

Crime News: పొలం పనుల కోసం వెళ్లి శవమై కనిపించిన నలుగురు కుటుంబసభ్యులు.. పోలీసుల విచారణలో సంచలనాలు!

Aadhaar: UIDAI మరో ప్రకటన.. కొత్తగా 166 ఆధార్‌ కేంద్రాల ఏర్పాటు.. ఇక్కడ ఏ పనులు జరుగుతాయంటే..?