Union Minister Kishan Reddy: కేంద్ర బొగ్గు, గనుల మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లపై నిప్పులు చెరిగారు. ఈ మేరకు ఓ ట్వీట్ చేసిన ఆయన బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు రెండూ ఒకటేనని అందులో పేర్కొన్నారు. ఢిల్లీలో అవినీతి పార్టీ ఆమ్ ఆద్మీ ఓడిపోవడంతో బీఆర్‌ఎస్ ఇబ్బందులో కూరుకపోయిందని, ఈ క్రమంలో బీఆర్‌ఎస్‌తో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవాలని బహిరంగ ఆహ్వానం ఇచ్చారంటూ విమర్శించారు. పాత స్నేహితులు తిరిగి కలవబోతున్నారని తెలిపారు. కేసీఆర్ కాంగ్రెస్‌తో తన ప్రయాణాన్ని ప్రారంభించారని, 2004లో ఆయన కూటమిగా ఎన్నికలలో పోరాడి UPA1లో మంత్రి అయ్యారంటూ గుర్తు చేశారు. ఇంకా, 2014లో తన TRS పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తానని హామీ ఇచ్చారని ఎద్దేవా చేశారు.
“బీఆర్‌ఎస్, కాంగ్రెస్ ఒకటేనని బీజేపీ మొదటి నుంచి చెబుతూనే ఉంది. ఒకే గూటి పక్షులు ఎలాగైనా కలిసి వస్తాయి. అవినీతి, మైనారిటీ సంతృప్తి, వంశపారంపర్య రాజకీయాలు, అధికార దాహం ఈ రెండు పార్టీలకు సాధారణం. కాంగ్రెస్ పార్టీ, బీఆర్‌ఎస్ పార్టీలు.. మతతత్వ ఎంఐఎం పార్టీ చేసిన ఒప్పందంలో మంచి స్నేహితులు అయ్యాయని తెలంగాణ ప్రజలకు తెలుసు” అంటూ మంత్రి కిషన్ రెడ్డి ఆయన విమర్శించారు.
With the loss of “partner in crime” Aam Admi Party in Delhi, the cat is out of the bag with KTR’s open invitation to Congress to align with BRS.
Old Friends are going to reunite. KCR began his journey with the Congress. He fought elections in alliance in 2004 and became… https://t.co/8RKNDcFee8
— G Kishan Reddy (@kishanreddybjp) February 9, 2025
ఈ క్రమంలో ఇరు పార్టీల మధ్య జరిగిన కొన్ని కీలక విషయాలను ఆయన ప్రస్తావించారు. అవేంటో ఓసారి చూద్దాం..
ఈ రెండు పార్టీల అనైతిక పొత్తును చెప్పేందుకు ఎన్నో ఉదాహరణలున్నాయని, అలాంటిది మరోసారి బహిరంగంగా దోస్తీకి ఈ రెండు కుటుంబ పార్టీలు సిద్ధమయ్యాయంటూ, చెత్త రాజకీయాలు, అవినీతికి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన ఈ పార్టీలను మరోసారి కలిపేందుకు మజ్లిస్ పార్టీ మధ్యవర్తిత్వం చేస్తోందంటూ కిషన్ రెడ్డి విమర్శలు గుప్పించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..