Amit Shah: కేంద్ర హోంశాఖ మంత్రి తెలంగాణ పర్యటన కొనసాగుతోంది. మునుగోడు బహిరంగ సభలో పాల్గొననున్నారు. దీంతో హైదరాబాద్‌కు చేరుకున్న అమిత్ షా.. సికింద్రాబాద్ మహంకాళి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ రైతు సంఘాల నేతలతో భేటీ అయ్యారు. వ్యవసాయ రంగంలో ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా రైతులతో అమిత్ షా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వారితో మాట్లాడుతూ.. నేను సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నా.. గో ఆధారిత సాగు చేయాలి. తాను 150 ఎకరాల్లో వ్యవసాయం చేస్తున్నానని అన్నారు.
నా దగ్గర 21 ఆవులున్నాయి..
నా దగ్గర కూడా 21 ఆవులు ఉన్నాయని, తాను కూడా 150 ఎకరాల్లో వ్యవసాయం చేస్తున్నానని అన్నారు. నా దగ్గరున్న 21 ఆవుల్లో 12 తరాల ఆవు ఒకటి ఉందని అన్నారు. అలాగే తాను కూడా ఆర్గానిక్ వ్యవసాయమే చేస్తున్నానని అమిత్ షా పేర్కొన్నారు. అయితే విద్యుత్ చట్టం మార్చాలని రైతులు అమిత్ షాను కోరగా, చట్టం కాదు.. ఇక్కడ ప్రభుత్వాన్ని మార్చాలి అని అన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి