Telangana Elections 2023: ‘బీఆర్ఎస్, ఎంఐఎం, కాంగ్రెస్‌ అన్నీ కుటుంబ పార్టీలే’.. జనగాం బహిరంగసభలో విరుచుకుపడ్డ కేంద్రమంత్రి అమిత్ షా..

తెలంగాణలో ఎన్నికల వేడి అగ్నిరాజేస్తోంది. ప్రతి పార్టీ తమ ప్రచారంలో మంచి కాకమీద ఉంది. ఇందులో భాగంగా బీజేపీ తన ప్రచారంలో వేగం పెంచి కార్యకర్తల్లో కొత్త జోష్ నింపుతోంది. ఈరోజు కేంద్ర మంత్రి అమిత్ షా జనగాం సభలో బీఆర్ఎస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. 'ఓవైసీకి భయపడే విమోచన దినం జరపడం లేదని' అన్నారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడ్డాక సెప్టెంబర్‌ 17 అధికారికంగా నిర్వహిస్తామని వాగ్ధానం చేశారు.

Telangana Elections 2023: బీఆర్ఎస్, ఎంఐఎం, కాంగ్రెస్‌ అన్నీ కుటుంబ పార్టీలే.. జనగాం బహిరంగసభలో విరుచుకుపడ్డ కేంద్రమంత్రి అమిత్ షా..
Union Home Minister Amit Shah criticizes all the parties in Telangana in BJP Jangaon Sabha

Updated on: Nov 20, 2023 | 3:16 PM

తెలంగాణలో ఎన్నికల వేడి అగ్నిరాజేస్తోంది. ప్రతి పార్టీ తమ ప్రచారంలో మంచి కాకమీద ఉంది. ఇందులో భాగంగా బీజేపీ తన ప్రచారంలో వేగం పెంచి కార్యకర్తల్లో కొత్త జోష్ నింపుతోంది. ఈరోజు కేంద్ర మంత్రి అమిత్ షా జనగాం సభలో బీఆర్ఎస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. ‘ఓవైసీకి భయపడే విమోచన దినం జరపడం లేదని’ అన్నారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడ్డాక సెప్టెంబర్‌ 17 అధికారికంగా నిర్వహిస్తామని వాగ్ధానం చేశారు. దీంతో పాటూ బైరాన్‌పల్లిలో అమరవీరుల స్మారకం నిర్మిస్తామన్నారు.

‘ప్రస్తుత బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్న జనగాం ఎమ్మెల్యే భూకుంభకోణాల్లో ఉన్నారని ఆరోపించారు. బీఆర్ఎస్, ఎంఐఎం, కాంగ్రెస్‌ అన్నీ కుటుంబ పార్టీలే అంటూ విమర్శించారు. కేసీఆర్, కేటీఆర్‌లను 2జీ పార్టీ అని..3 తరాల నేతల ఎంఐఎంను 3జీ పార్టీగా అభివర్ణించారు. ఇక కాంగ్రెస్ పార్టీపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. 4 తరాల నెహ్రూ, ఇందిర, రాజీవ్‌, రాహుల్‌ పార్టీని 4జీ పార్టీ అంటూ ఎద్దేవా చేశారు. కానీ బీజేపీ అంటే తెలంగాణ ప్రజల పార్టీ అంటూ చెప్పుకొచ్చారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం దేశంలోనే అత్యంత అవినీతి ప్రభుత్వం’ అని దుయ్యబట్టారు.

 

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..