Ugadi 2023: ‘మత ఘర్షణలు జరుగుతాయి’.. పంచాంగ శ్రవణంలో కీలక విషయాలు చెప్పిన శారదాపీఠం పండితులు..

రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో ఘనంగా ఉగాది వేడుకలు జరిగాయి. ఈ వేడుకలకు మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు..

Ugadi 2023: ‘మత ఘర్షణలు జరుగుతాయి’.. పంచాంగ శ్రవణంలో కీలక విషయాలు చెప్పిన శారదాపీఠం పండితులు..
Ugadi 2023 Panchangam

Updated on: Mar 22, 2023 | 4:35 PM

రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో ఘనంగా ఉగాది వేడుకలు జరిగాయి. ఈ వేడుకలకు మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా శోభ్‌క‌ృత్ నామ సంవత్సర పంచాంగాన్ని ఆవిష్కరించారు మంత్రులు. ఉగాది పంచాంగ శ్రవణ వేడుకల్లో భాగంగా శారదా పీఠం పండితులు బ్రహ్మర్షి బాచంపల్లి సంతోష్ కుమార్ పంచాంగ పఠనం వినిపించారు. పంచాంగ శ్రవణ వివరాలు యధావిధిగా..

‘ఈ సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం సుపరిపాలన అందింస్తుంది. అన్ని పనులు ఈ సంవత్సరం పూర్తవుతాయి. తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అన్ని ప్రాజెక్టులు పూర్తిగా నిండుతాయి. జల వృద్ధి అధికంగా ఉంటుంది. ఈ సంవత్సరం పాడిపంటలు అద్భుతంగా ఉంటాయి. విద్యావకాశాలు మెరుగు పడుతాయి. విద్యా రంగంలో సమూలమైన మార్పులు వస్తాయి. పెండింగ్ బిల్లులన్నింటికి ఈ ఏడాది క్లియరెన్స్ రాబోతోంది. కొంతమంది వ్యక్తుల కారణంగా ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతుంది. పాలించే రాజు జాగ్రత్తగా ఉండాలి. విద్యా శాఖలో కొన్ని అవకతవకలు జరిగే ప్రమాదం ఉంది. న్యాయ వ్యవస్థ ఈ ఏడాది మంచి తీర్పులు ఇవ్వబోతోంది. సుప్రీంకోర్టు, హైకోర్టు ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పులు ఇవ్వబోతున్నాయి. ఈ ఏడాది ప్రతిపక్షాలు తమ ఉనికిని కాపాడుకోవాలి. కొన్ని మత ఘర్షణలు, సామాజిక ఉద్రిక్తతలు జరిగే అవకాశం ఉంది. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరమైన సంఘటనలు జరగబోతున్నాయి. ఈ మూడు మాసాల్లో విపరీతమైన ఒడిదుడుకులు జరగబోతున్నాయి. మత ఘర్షణలు జరిగే ప్రమాదం ఉంది. పోలీసులు అప్రమత్తంగా ఉండాలి.’ అని పంచాంగంలో శ్రవణం వినిపించారు.

సీతారాముల కళ్యాణానికి ఆహ్వానం..

ఇదిలాఉంటే.. వేడుకల్లో భాగంగా భద్రాద్రి శ్రీరామచంద్రుల ఆహ్వాన పత్రికను మంత్రులకు అందించి శ్రీరామ నవమి వేడులకు ఆహ్వానించారు భద్రాచలం ఆలయ అర్చకులు. ఇక మంత్రులు నేరుగా ప్రగతి భవన్‌ వెళ్లి భద్రాచలంలో జరిగే సీతారాముల కల్యాణానికి రావాలంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆహ్వానం అందించారు. ఈనెల 30న భద్రాచలంలో జరిగే ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొనాలని కోరుతూ ప్రగతిభవన్‌‌కు వెళ్లి కేసీఆర్‌ దంపతులను ఆహ్వానించారు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి. ఆలయ ప్రతినిధులతో కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..