Telangana Fears Tiger: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను పెద్ద పులులు వణికిస్తున్నాయి. తాజాగా కొమురంభీం జిల్లా బెజ్జూర్ మండలంలో వరుస పులుల దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ సారి ఏకంగా రెండు పులులు ఒకేసారి దాడులకు తెగబడ్డాయి. బెజ్జూరు మండలంలోని అందుగులగూడ అటవీ ప్రాంతంలోని పెద్దగుట్ట సమీపంలో పశువుల మందపై పెద్ద పులులు దాడి చేశాయి. పొదల మాటు నుంచి ఒకేసారి వచ్చి రెండు పెద్దపులులు దాడి చేశాయి. దీంతో మూగజీవాలు చెల్లాచెదురయ్యాయి. అక్కడే ఉన్న అందుగులగూడ కాపర్లు ఎర్మ నారాయణ, ఆలం శ్రీనివాస్, ఆలం ఈశ్వర్, శ్రీకాంత్, ఉదయ్‌కిరణ్ భయాందోళనకు గురై కేకలు వేశారు.
ఇదే గ్రామానికి చెందిన కోర్తే బిచ్చుకు చెందిన ఓ కోడే పులిదాడిలో తీవ్రగాయాల పాలైంది. మరో ఆవుకు సైతం స్వల్ప గాయాలు అయ్యాయి. పశువుల కాపర్లు కేకలు వేయడంతో పులులు అటవీ ప్రాంతంలోకి పారిపోయినట్టు కాపర్లు తెలిపారు. పులి దాడి సమాచారాన్ని బెజ్జూరు రేంజ్ అధికారి దయాకర్‌కు తెలిపారు పశువులకాపారులు. అప్రమత్తమైన అటవిశాఖ రెండు పులులు ఏకకాలంలో దాడులు చేయడంపై విచారణ జరుపుతామని తెలిపారు. అందుగులగూడ సమీపంలోని అటవీ ప్రాంతంలోకి పశువులను తీసుకెళ్లొద్దని, పంట చేన్లకు వెళ్లేటప్పుడు గుంపులుగా వెళ్లాలని అటవిశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. కాగా, రెండు పెద్ద పులులు ఒకేసారి దాడికి పాల్పడటంతో స్థానిక ప్రజలు రైతులు, పశువుల కాపరులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
Also read:
Film Festival in Egypt: షాకింగ్ వీడియో.. ఫిల్మ్ ఫెస్ట్ హాల్‌లో అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు..
Rishabh Pant: గ్రౌండ్ లోనే ఏడ్చేసిన పంత్.. ఆలస్యంగా బయటకి వచ్చి వైరల్ గా మారిన వీడియో..