Nizamabad: నిజామాబాద్‌ జిల్లాలో దారుణం.. అక్కాచెల్లెళ్లను దారుణంగా హత్య చేసిన దుండగులు.. ఆపై..

ఇద్దరు అక్క చెల్లెలు మగ్గిడి గంగవ్వ (62), మగ్గిడి రాజవ్వ (72) లను అర్ధరాత్రి వారు నివసిస్తున్న ఇంట్లో గుర్తు తెలియని దుండగులు హత్య చేసి, ఇంటికి నిప్పంటించిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.

Nizamabad: నిజామాబాద్‌ జిల్లాలో దారుణం.. అక్కాచెల్లెళ్లను దారుణంగా హత్య చేసిన దుండగులు.. ఆపై..
Murder In Nizamabad

Edited By:

Updated on: Jul 19, 2023 | 3:11 PM

ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని జిరాయత్ నగర్ లో నివసిస్తున్న ఇద్దరు అక్కచెల్లెలను రాత్రి గుర్తు తెలియని దుండగులు హత్య చేసి ఘటన స్థానికంగా భయాందోళనకు గురిచేసింది. ఇద్దరు అక్క చెల్లెలు మగ్గిడి గంగవ్వ (62), మగ్గిడి రాజవ్వ (72) లను అర్ధరాత్రి వారు నివసిస్తున్న ఇంట్లో గుర్తు తెలియని దుండగులు హత్య చేసి, ఇంటికి నిప్పంటించిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. స్థానికులు తెలిపిన ప్రకారం గత 20 సంవత్సరాలుగా ఇద్దరు అక్క చెల్లెలు ఒంటరిగా నివసిస్తున్నట్లు చెప్పారు. ఆదివారం మల్లన్న గుట్ట వద్ద కుటుంబ సభ్యులతో కలిసి పండుగలో పాల్గొన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మంగళవారం సాయంత్రం గంగవ్వ ను ఆమె చిన్న కుమారుడు మహిపాల్ ముదురులోని కంటి ఆసుపత్రిలో కంటి పరీక్ష చేయించి అనంతరం సాయంత్రం వారిద్దరిని మామిడి పల్లి నుండి జిరాయాత్ నగర్ లోని మృతులు ఉంటున్న ఇంట్లో దిగ పెట్టి వెళ్లినట్లు స్థానికులు చెబుతున్నారు. అనంతరం వేకువజామున ఇంట్లో నుండి పొగలు రావడం గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. కిటికీలు బద్దలు కొట్టి మంటలు ఆర్పే క్రమంలో మృతులు ఇద్దరు కనబడడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం డాగ్స్వాడ్ బృందం అక్కడికి చేరుకుని తనిఖీలు నిర్వహించారు.

వృద్ధ మహిళల వద్ద ఒంటినిండా సుమారు 15 నుండి 20 వరకు బంగారం ఉంటుందని స్థానికులు చెప్పారు. నగలు, బంగారం కోసం దుండగులు ఎవరైనా వీరిని హత్య చేసి ఉంటారని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. స్థానికంగా ఉన్నసీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తిస్తామని పోలీసులు తెలిపారు. నిజామాబాద్ జిల్లా ఇంచార్జ్. ప్రవీణ్ కుమార్ తోపాటు ఆర్మూర్ సురేష్ బాబు సంఘటన స్థలాన్ని పరిశీలించారు

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం  క్లిక్ చేయండి..