Telangana: హైవేపై ఘోర అగ్ని ప్రమాదం.. మంటల్లో చిక్కుకుని రెండు ఆర్టీసీ బస్సులు దగ్ధం..

సూర్యాపేట జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. చివ్వెంల మండలం గుంపుల శివారులో హైదరాబాద్ - విజయవాడ నేషనల్ హైవేపై రెండు బస్సులు మంటల్లో చిక్కుకున్నాయి. ఏపీఎస్‌ ఆర్టీసీకి చెందిన రెండు..

Telangana: హైవేపై ఘోర అగ్ని ప్రమాదం.. మంటల్లో చిక్కుకుని రెండు ఆర్టీసీ బస్సులు దగ్ధం..
Fire Accident In Bus
Follow us

|

Updated on: Feb 26, 2023 | 12:46 PM

సూర్యాపేట జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. చివ్వెంల మండలం గుంపుల శివారులో హైదరాబాద్ – విజయవాడ నేషనల్ హైవేపై రెండు బస్సులు మంటల్లో చిక్కుకున్నాయి. ఏపీఎస్‌ ఆర్టీసీకి చెందిన రెండు బస్సుల్లో ప్రమాదవశాత్తు మంటలు అంటుకున్నాయి. ఈ ఘటనలో రెండు బస్సులూ పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. ఆదివారం వేకువజామున హైదరాబాద్‌ నుంచి విజయవాడ వెళ్తున్న ‘వెన్నెల’ బస్సులో సాంకేతికలోపం తలెత్తింది. బ్యాటరీలో తలెత్తిన సమస్యతో బస్సు లైట్లు పనిచేయలేదు. ప్రయాణికులను వేరే బస్సుల్లో పంపించారు.

సూర్యాపేట నుంచి ఏపీఎస్‌ఆర్టీసీకే చెందిన మరో బస్సును తీసుకువచ్చారు. వైర్ల సాయంతో రెండు బస్సుల మధ్య బ్యాటరీ సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేశారు. ఈలోపు సూర్యాపేట నుంచి వచ్చిన ఆర్టీసీ బస్సులో పెద్ద శబ్ధం వచ్చి మంటలు చెలరేగాయి. ఆ మంటలు మరో బస్సుకూ వ్యాపించాయి. అయితే బస్సులో ఎవరూలేకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

అర‌టిపండే కాదు..అర‌టికాయ తిన్నా అమృతమే..! లాభాలు తెలిస్తే..
అర‌టిపండే కాదు..అర‌టికాయ తిన్నా అమృతమే..! లాభాలు తెలిస్తే..
గేమ్ ఛేంజర్ పాట రెస్పాన్స్ ఎలా ఉంది..? శంకర్ మార్క్ కనిపించిందా.?
గేమ్ ఛేంజర్ పాట రెస్పాన్స్ ఎలా ఉంది..? శంకర్ మార్క్ కనిపించిందా.?
ఏపీలో కాపు సామాజికవర్గాన్ని బీజేపీ పట్టించుకోలేదా? అసలు కారణం
ఏపీలో కాపు సామాజికవర్గాన్ని బీజేపీ పట్టించుకోలేదా? అసలు కారణం
చేపలకోసం వేసిన వలలో చిక్కకున్న భారీ ఆకారం.. వలను విప్పి చూస్తే
చేపలకోసం వేసిన వలలో చిక్కకున్న భారీ ఆకారం.. వలను విప్పి చూస్తే
హెయిర్ స్ట్రెయిట్నింగ్‌ చేయించుకున్న మహిళకు కిడ్నీ ఫెయిల్యూర్..
హెయిర్ స్ట్రెయిట్నింగ్‌ చేయించుకున్న మహిళకు కిడ్నీ ఫెయిల్యూర్..
92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
'నువ్వు మారిపోయావు భయ్యా'..ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్
'నువ్వు మారిపోయావు భయ్యా'..ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్