Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Coronavirus: తెలుగు రాష్ట్రాల్లో కరోనా టెర్రర్.. వైరస్‌తో ఇద్దరు మృతి.. హైదరాబాద్‌, వైజాగ్‌లో..

కరోనావైరస్ మళ్లీ కలవరపెడుతోంది. దేశంలో రోజురోజుకు పెరుగుతున్న కేసులు.. మరణాలు కలవరపెడుతున్నాయి. తాజాగా.. తెలుగు రాష్ట్రాల్లో సైతం కరోనా కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తుంది. చాప కింద నీరులా విస్తరిస్తోన్న కరోనా మహమ్మారి ఇద్దరిని బలి తీసుకుంది. తాజాగా.. తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కరోనాతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.

Follow us
Shaik Madar Saheb

|

Updated on: Dec 26, 2023 | 3:08 PM

కరోనావైరస్ మళ్లీ కలవరపెడుతోంది. దేశంలో రోజురోజుకు పెరుగుతున్న కేసులు.. మరణాలు కలవరపెడుతున్నాయి. తాజాగా.. తెలుగు రాష్ట్రాల్లో సైతం కరోనా కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తుంది. చాప కింద నీరులా విస్తరిస్తోన్న కరోనా మహమ్మారి ఇద్దరిని బలి తీసుకుంది. తాజాగా.. తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కరోనాతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. వాస్తవానికి వీరిద్దరూ అనారోగ్య సమస్యలతో ఆస్పత్రుల్లో చేరారు. ఆ తర్వాత వీరికి కరోనా నిర్ధారణ అయినట్లు అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్‌ ఉస్మానియా ఆస్పత్రిలో ఒకరు చనిపోగా, విశాఖ KGHలో చికిత్సపొందుతూ మహిళ చనిపోయింది. చనిపోయిన ఇద్దరికి కరోనా పాజిటివ్ అని డాక్టర్లు‌ నిర్ధారించారు. విశాఖ KGHలో చనిపోయిన సోమకళ అనే 51 ఏళ్ల మహిళకు కరోనా మాత్రమే కాకుండా, ఇతర ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నట్లు డాక్టర్లు ప్రకటించారు. హైదరాబాద్ లో కూడా ఇతర కారణాలతో చనిపోయినట్లు చెబుతున్నారు. ఇదిలాఉంటే.. రోజువారీ కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి. అధికారులను జాగ్రత్తలు పాటించాలని ఆదేశాలు ఇస్తున్నాయి.

కాగా.. తాజాగా వచ్చిన జేఎన్1 వేరియంట్ కూడా ప్రజల ఆరోగ్యంపై పెద్దగా ప్రభావం చూపదని డబ్ల్యూహెచ్ఓ స్పష్టం చేసింది. అయితే.. ప్రజలు ముందుజాగ్రత్త చర్యలు తప్పకుండా తీసుకోవాలని సూచించింది. అటు.. కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో కేంద్ర ఆరోగ్య శాఖ రాష్ట్ర ప్రభుత్వాల్ని అప్రమత్తం చేసింది. కొవిడ్ నియంత్రణ చర్యలపై దృష్టి సారించాలని ఆదేశించింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..