
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ దేవస్థానానికి ప్రతిరోజు వేలాది మంది భక్తులు స్వామివారి దర్శనం కోసం వస్తుంటారు. అంతేకాకుండా ఒకరోజు ఇక్కడనే నిద్రిస్తారు. అలయ వసతిగృహాలలోనే భక్తులు ఉంటున్నారు. ముఖ్యంగా పార్వతిపురంలో ఉన్న వసతిగృహల్లో ఎక్కువ మంది భక్తులు ఉంటున్నారు. ఈ క్రమంలోనే వారం రోజుల క్రితం ఒక పాము ఆలయ ప్రాంగణంలోనే కనిపించింది. భక్తులు చూసి వెంటనే సిబ్బందికి సమాచారం ఇచ్చారు.స్నేక్ క్యాచర్ పామును పట్టుకుని దూర ప్రాంతాలకి తీసుకువెళ్ళి వదిలిపెట్టారు. తాజాగా ఆదివారం పార్వతీపురం అలయ వసతిగృహంలోనే మరో పాము కనిపించింది. సిబ్బంది వసతి గృహన్ని శుభ్రపరుస్తుండగా నాగుపాము ఒకేసారి బుసలు కొట్టింది. దీంతో అక్కడ ఉన్న భక్తులందరూ పరుగులు తీసారు. సిబ్బంది జగదీష్ అనే స్నేక్ క్యాచర్‌కి సమాచారం ఇవ్వడంతో వసతి గృహానికి వచ్చి పామును పట్టుకున్నాడు.
సుమారుగా ఇరవై నిమిషాల పాటు పాము అటూ ఇటూ తిరిగింది. అతికష్టం మీద పామును పట్టుకుని ఒక సంచిలో వేసి వేములవాడ శివారులో వదిలిపెట్టారు. వారం రోజులలోనే రెండు నాగుపాములు వసతిగృహల్లొ కనిపించడంతో భక్తులు మరింత అందోళనకు గురి అవుతున్నారు. ఇక్కడ మరిన్ని పాములు ఉండే అవకాశం ఉందని భయడుతున్నారు.స్నేక్ క్యాచర్‌తో ఈ ప్రాంతాన్ని మొత్తం గాలించి పూర్తి స్థాయిలో పాములని పట్టుకుని దూర ప్రాంతాలలో వదిలిపెట్టాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..