Elephant Attack: కొమురంభీం జిల్లాలో గజరాజు స్వైరవిహారం.. 24గంటల్లో ఇద్దరు రైతుల మృతి

కొమురంభీం జిల్లాలో మదగజం టెర్రర్‌ పుట్టిస్తోంది. గజరాజు బీభత్సానికి 24గంటల్లో ఇద్దరు రైతులు బలైపోయారు. మదగజం స్వైరవిహారంతో కాగజ్‌నగర్‌ కారిడార్‌ మొత్తం గజగజ వణికిపోతోంది.పెంచికల్‌పేట, బెజ్జూర్‌ గ్రామాల్లో ఏనుగు విధ్వంసం సృష్టిస్తోంది. పంట పొలాలను ధ్వంసం చేస్తూ.. కనిపించిన రైతులపై దూసుకొచ్చి చంపేస్తోంది.

Elephant Attack: కొమురంభీం జిల్లాలో గజరాజు స్వైరవిహారం.. 24గంటల్లో ఇద్దరు రైతుల మృతి
Elephant

Updated on: Apr 04, 2024 | 7:20 AM

కొమురంభీం జిల్లాలో మదగజం టెర్రర్‌ పుట్టిస్తోంది. గజరాజు బీభత్సానికి 24గంటల్లో ఇద్దరు రైతులు బలైపోయారు. మదగజం స్వైరవిహారంతో కాగజ్‌నగర్‌ కారిడార్‌ మొత్తం గజగజ వణికిపోతోంది.పెంచికల్‌పేట, బెజ్జూర్‌ గ్రామాల్లో ఏనుగు విధ్వంసం సృష్టిస్తోంది. పంట పొలాలను ధ్వంసం చేస్తూ.. కనిపించిన రైతులపై దూసుకొచ్చి చంపేస్తోంది. అలా, బూరుపల్లిలో ఒకరిని, కొండపల్లిలో మరొకరిని బలి తీసుకుంది మదగజం. గజరాజు స్వైరవిహారంతో కాగజ్‌నగర్‌ కారిడార్‌లో హైఅలర్ట్‌ ప్రకటించారు అటవీ అధికారులు. ఇళ్ల నుంచి బయటికి రావద్దంటూ గ్రామాల్లో చాటింపు వేయించారు. కొండపల్లి గ్రామంలోకి ఏనుగు ఎంటర్‌ అవడంతో భయంతో వణికిపోతున్నారు గ్రామస్తులు.

జిల్లాలో ఏనుగు దాడితో సమీప గ్రామాల ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. రాష్ట్ర సరిహద్దు మహారాష్ట్ర అటవీ ప్రాంతం నుంచి కొమురంభీం జిల్లాలోకి ఏనుగు ప్రవేశించిందని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. రైతును హతమార్చిన తర్వాత లంబాడీ హెటీ, గంగాపూర్ వైపు ఏనుగు వెళ్లిపోయినట్లు స్థానికులు వెల్లడించారు. విషయం తెలుసుకున్న అటవీ శాఖ సిబ్బంది బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు. జనవాసాల్లోకి వచ్చిన ఏనుగును తిరిగి మహారాష్ట్ర అడవుల్లోకి పంపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. కాగా ఏనుగు దాడిలో మృతి చెందిన రైతు శంకర్ కుటుంబానికి మంత్రి కొండా సురేఖ రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.

 మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…