ప్రణయ్‌‌‌ కేసులో తీర్పుతో 2 కుటుంబాల్లో భావోద్వేగం… కొడుకుని తలుచుకుని ప్రణయ్‌ తల్లిదండ్రుల కన్నీరు

ప్రణయ్‌‌‌ కేసులో తీర్పుతో 2 కుటుంబాల్లో భావోద్వేగం నెలకొంది. కొడుకుని తలుచుకుని ప్రణయ్‌ తల్లిదండ్రుల కన్నీరు పెట్టుకున్నారు. మిర్యాలగూడలో ప్రణయ్‌ సమాధి దగ్గర పేరెంట్స్‌ నివాళులు అర్పించారు. హత్య కేసులో అమృత బాబాయ్‌ శ్రవణ్‌కి జీవితఖైదు విధించింది కోర్టు. శిక్ష పడడానికి అమృతే కారణమంటూ శ్రవణ్‌ భార్యాపిల్లలు కన్నీరు పెట్టుకున్నారు. ప్రణయ్‌ కేసు సమాజానికి గుణపాఠం కావాలని అటు పోలీసులు చెప్పారు. రెండు కుటుంబాలు

ప్రణయ్‌‌‌ కేసులో తీర్పుతో 2 కుటుంబాల్లో భావోద్వేగం... కొడుకుని తలుచుకుని ప్రణయ్‌ తల్లిదండ్రుల కన్నీరు
Pranay Case

Updated on: Mar 10, 2025 | 2:03 PM

ప్రణయ్‌‌‌ కేసులో తీర్పుతో 2 కుటుంబాల్లో భావోద్వేగం నెలకొంది. కొడుకుని తలుచుకుని ప్రణయ్‌ తల్లిదండ్రుల కన్నీరు పెట్టుకున్నారు. మిర్యాలగూడలో ప్రణయ్‌ సమాధి దగ్గర పేరెంట్స్‌ నివాళులు అర్పించారు. హత్య కేసులో అమృత బాబాయ్‌ శ్రవణ్‌కి జీవితఖైదు విధించింది కోర్టు. శిక్ష పడడానికి అమృతే కారణమంటూ శ్రవణ్‌ భార్యాపిల్లలు కన్నీరు పెట్టుకున్నారు. ప్రణయ్‌ కేసు సమాజానికి గుణపాఠం కావాలని అటు పోలీసులు చెప్పారు. రెండు కుటుంబాలు నష్టపోయాయని నాటి ఎస్పీ రంగనాథ్‌ తెలిపారు.

కోర్టు తీర్పు తర్వాత ప్రణయ్‌ తండ్రి బాలస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ తీర్పు నేరస్తులకు కనువిప్పు కావాలన్నారు బాలస్వామి. కులం పేరుతో కన్నకూతుళ్లను చంపేవారికి ఈ తీర్పు కనువిప్పు కావాలని చెప్పారు. ప్రణయ్‌ హత్య తర్వాత తాము చాలా నష్టపోయామని బాలస్వామి చెప్పారు. తమకు కొడుకు లేకుండా పోయాడు.. అమృతకు తండ్రిలేకుండా పోయాడు.. అమృత తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు.. న్యాయం కోసం ఆరున్నరేళ్లు ఎదురుచూశామని బాలస్వామి భావోద్వేగం చెందారు.

2018 సెప్టెంబర్ 14న మిర్యాలగూడలో ప్రణయ్ దారుణ హత్యకు గురయ్యాడు. అప్పట్లో తెలుగు రాష్ట్రాల్లో ఈ ఘటన సంచలనం రేపింది. 2018లో అమృత, ప్రణయ్‌లు కులాంతర ప్రేమ వివాహం చేసుకున్నారు. కూతురు కులాంతర ప్రేమ వివాహం ఇష్టం లేని తండ్రి మారుతి రావు సుపారీ గ్యాంగ్‌తో ప్రణయ్‌ను హత్య చేయించాడు. ప్రణయ్ తండ్రి బాలస్వామి ఫిర్యాదుతో 8 మందిపై కేసు నమోదైంది. 2019 జూన్ 12న పోలీసులు 1600 పేజీల ఛార్జిషీట్ దాఖలు చేశారు. ఐదేళ్ల 9 నెలల పాటు విచారణ సాగింది. కేసు విచారణలో ఉండగానే ఏ1 నిందితుడు అమృత తండ్రి మారుతీరావు 2020 మార్చి 7న హైదరాబాద్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు.