two Died to Electric Shock : నారాయణపేట జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. దామరగిద్ద మండలం బాపన్ పల్లి గ్రామంలో ఇద్దరు వ్యక్తులు విద్యుదాఘాతానికి గురై మృత్యువాతపడ్డారు. మరో 40మందికి గాయాలయ్యాయి. స్థానికంగా ఉన్న వెంకటరమణ స్వామి దేవాలయం కోసం ఇనుప రథాన్ని తరలిస్తుండగా.. విద్యుత్ వైర్లు తగిలి కరెంట్ షాక్ పాస్ అయ్యింది. దీంతో ఇద్దరు గ్రామస్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 40 మందికి గాయాలయ్యాయి. దీంతో క్షతగాత్రులు నారాయణపేట ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులు వారిని చంద్రప్ప, హనుమంతుగా గుర్తించారు. గాయపడిన వారిలో నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం బాపనపల్లికి చెందిన 20మంది శివ స్వాములు కూడా ఉన్నారని స్థానికులు తెలిపారు. బ్రహోత్సవాల సందర్బంగా దేవతామూర్తులను ట్రాక్టర్ మీద వెళుతుండగా షార్ట్ సర్కిల్ జరిగింది. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి.. ఆకట్టుకుంటున్న సూర్య ‘ఆకాశం నీ హద్దురా’ డిలిటెడ్ సీన్.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో..