Telangana: అన్నకు ప్రభుత్వ ఉద్యోగం.. తమ్ముడు సాఫ్ట్‌వేర్.. చివరికి ఒకేసారి ఇద్దరు మృతి

హన్మకొండ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదం ఇద్దరు అన్నదమ్ముల్ని మృతి చెందడం కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం కందుగులకు చెందిన ఇప్పలపల్లి మనోహర్‌కు ఇద్దరు కుమారులు.

Telangana: అన్నకు ప్రభుత్వ ఉద్యోగం.. తమ్ముడు సాఫ్ట్‌వేర్.. చివరికి ఒకేసారి ఇద్దరు మృతి
Death

Updated on: May 23, 2023 | 4:45 AM

హన్మకొండ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదం ఇద్దరు అన్నదమ్ముల్ని మృతి చెందడం కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం కందుగులకు చెందిన ఇప్పలపల్లి మనోహర్‌కు ఇద్దరు కుమారులు. పెద్ద కొడుకు శివరామకృష్ణ(25) రైల్వే శాఖలో ఉద్యోగానికి ఎంపికై సికింద్రాబాద్ మౌలాలీలో శిక్షణ పొందుతున్నాడు. చిన్న కొడుకు హరికృష్ణ ఓ ప్రైవేట్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. అయితే ఇటీవల పెద్దకుమారుడు శివరామకృష్ణకు పోస్టల్‌ శాఖలో మరో ఉద్యోగం వచ్చింది. ఈ విషయం చెప్పేందుకు ఆదివారం స్వగ్రామం కందుగులకు వచ్చాడు. తిరిగి సోమవారం డ్యూటీకి వెళ్లాలని ఉదయం 4.30 గంటలకు ఇంటి నుంచి తమ్ముడితో కలిసి స్కూటీపై హైదరాబాద్‌కు బయలుదేరాడు.

ఈ క్రమంలో హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం అనంతసాగర్‌ క్రాస్‌ రోడ్డు వద్దకు రాగానే 5.30 గంటల ప్రాంతంలో గుర్తు తెలియని వాహనం వారి స్కూటీని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో శివరామకృష్ణ, హరికృష్ణ తలలకు తీవ్రంగా గాయాలయ్యాయి. దీంతో ఆ అన్నదమ్ముల్లు అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు ఘటనా స్థలానికి చేరుకొని కన్నీరుమున్నీరుగా విలపించారు. ఇద్దరు కొడుకులు మృతి చెందడంతో తమ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తండ్రి మనోహర్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే ప్రమాదానికి కారణమైన వాహనాన్ని గుర్తించేందుకు సీసీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..