Telangana: ఆదాయం అదానీకి.. వ్యయం జనానికి, బ్యాంకులకు.. బీజేపీపై కేటీఆర్ సెటైర్.. సంజయ్ కౌంటర్..

ఉగాది పంచాంగం తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త రచ్చకు దారితీసింది. అధికార, విపక్ష పార్టీల నేతల సెటైర్లు, కౌంటర్లతో సోషల్ మీడియాలో పొలిటికల్ వార్ నడుస్తోంది. బీజేపీ టార్గెట్‌గా మంత్రి కేటీఆర్ సెటైర్లు వేయగా..

Telangana: ఆదాయం అదానీకి.. వ్యయం జనానికి, బ్యాంకులకు.. బీజేపీపై కేటీఆర్ సెటైర్.. సంజయ్ కౌంటర్..
Ktr Vs Bandi Sanjay

Updated on: Mar 22, 2023 | 8:01 PM

ఉగాది పంచాంగం తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త రచ్చకు దారితీసింది. అధికార, విపక్ష పార్టీల నేతల సెటైర్లు, కౌంటర్లతో సోషల్ మీడియాలో పొలిటికల్ వార్ నడుస్తోంది. బీజేపీ టార్గెట్‌గా మంత్రి కేటీఆర్ సెటైర్లు వేయగా.. అంతే ఘాటుగా రియాక్ట్ అయ్యారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. మంత్రికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మరి ఈ ఇద్దరి మధ్య జరిగిన ట్వీట్ వార్ ఏంటో ఇప్పుడు చూద్దాం..

ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా.. బీజేపీపై సెటైర్లు వేశారు. పంచాంగం శ్రవణానికి పేరడి అన్నట్లుగా.. బీజేపీపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు మంత్రి కేటీఆర్. ‘ఆదాయం అదానీకి.. వ్యయం జనానికి, బ్యాంకులకు. అవమానం నెహ్రూకి.. రాజపూజ్యం గుజరాతీ గుంపుకి. బస్, బభ్రాజీమానం భజగోవిందం. దేశీయ ఉగాది పంచాంగం సమాప్తం’ అంటూ మంత్రి కేటీఆర్ సెటైర్లు వేస్తూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ పొలిటికల్‌గా సెన్సేషన్ క్రియేట్ చేయగా.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వెంటనే స్పందించారు. ఆ ట్వీట్‌కు ఘాటు రిప్లై ఇచ్చారు.

ఇవి కూడా చదవండి

బండి సంజయ్ ట్వీట్ ఇదే..

కేటీఆర్‌కు కౌంటర్ ట్వీట్ చేసిన బండి సంజయ్.. ఘాటైన కామెంట్స్ చేశారు. ‘ఆదాయం కల్వకుంట్ల కుటుంబానికి.. వ్యయం తెలంగాణ రాష్ట్రానికి.. అవమానం ఉద్యమ వీరులకు, అమరుల త్యాగాలకు.. రాజపూజ్యం ఉద్యమ ద్రోహులకు, దొంగలకు.. పిట్టలదొర, తుపాకీ చంద్రుల గడీల పంచాయితీ.. లెక్క తేలుడే తరువాయి.. పతనం ఇగ షురువాయే’ అంటూ బండి సంజయ్ ఘాటైన వ్యాఖ్యలతో కౌంటర్ ఇచ్చారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..