Telangana: పసిడితో పోటీ పడుతున్న పసుపు ధరలు .. మార్కెట్లో సరికొత్త రికార్డులు.. పచ్చబంగారం ఎవరికి లాభం..?

| Edited By: Jyothi Gadda

Aug 12, 2023 | 9:39 AM

warangal: ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా దాదాపు 3700 ఎకరాలలో పసుపు సాగు జరిగింది.. ఆ పసుపు ఇప్పటికే చాలా వరకు అమ్మకానికి తరలించారు.. సాగు చేసిన పసుపుకు ఎంత దొరికితే అంతే లాభం అనుకున్నట్లు అమ్మేసి వచ్చిన పైకంతో తిరిగి వెళ్లారు.. వ్యాపారుల చేతికి చేరిన తర్వాత ఒక్కసారిగా రెక్కలు రావడం రైతులకు మాత్రం కొంత ఆనందం మరికొంత విషాదం మిగిల్చింది. అయితే జాతీయ, అంతర్జాతీయ మార్కెట్ లో పసుపుకు విపరీతమైన డిమాండ్ పెరగడమే కారణంగా వ్యాపారాలు చెప్తున్నారు..

Telangana: పసిడితో పోటీ పడుతున్న పసుపు ధరలు .. మార్కెట్లో సరికొత్త రికార్డులు.. పచ్చబంగారం ఎవరికి లాభం..?
Turmeric
Follow us on

వరంగల్,ఆగస్టు 12: పసుపు రైతుల పాలిట బంగారంలా మారింది. గత కొనేళ్లుగా నష్టాలు, కష్టాలతో అల్లాడిపోయిన రైతులు.. ప్రస్తుత ధరలతో కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. క్రమంగా పెరుగుతున్న ధర పసపు రైతు పంట పండిస్తుంది. ఆసియాకెల్లా రెండో అతిపెద్ద మార్కెట్‌గా పేరొందిన వరంగల్ ఏనుమాముల మార్కెట్‌లో పసుపు ధరలు సరికొత్త రికార్డ్‌ సృష్టిస్తున్నాయి. అంతర్జాతీయంగా పసుపుకు డిమాండ్ పెరగడం, రాష్ట్రంలో పసుపు పంట దిగుబడి తగ్గడంతో ధరలు భారీగా పెరుగుతున్నాయి. రోజుల వ్యవధిలోనే పసుపు ధర ఊహించని విధంగా అమాంతం పెరిగింది.. క్వింటాకు 12 వేల రూపాయల పైబడి ధర పలుకుతుంది.. వరంగల్ జిల్లాలోని వ్యవసాయ మార్కెట్ యార్డులలో పసుపుకు క్వింటా 12 వేల రూపాయల పైగా ధర లభిస్తుండడం తో రైతులు ఆనంద వ్యక్తం చేస్తున్నారు..

ప్రస్తుతం చేతిలో ఉన్న పసుపు అమ్మకానికి తరలిస్తున్నారు. వరంగల్ లోని ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డ్ తో పాటు, కేసముద్రం మార్కెట్ యార్డ్ లో గత నాలుగు రోజుల నుండి 12 వేల రూపాయల పైబడి ధర పలుకుతున్నాయి. అయితే ఇప్పటికే చాలావరకు పసుపు రైతుల చేతినుండి చిరు వ్యాపారల చేతిలోకి చేరుకుంది.. ఇప్పుడు ధరల పెరగడం వల్ల ఆ వ్యాపారులకే ఎక్కువ లాభం చేకూరుతుందని మరికొందరు రైతులు అంటున్నారు.. గతంలో క్వింట ఆరు వేలకు మించి పసుపు ధర ఎప్పుడు పెద్దగా లాభం చేకూరలేదు.. దీంతో పసుపుకు ప్రత్యామ్నాయ పంటలవైపు రైతులు అడుగులు వేశారు..

ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా..

ఇవి కూడా చదవండి

ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా దాదాపు 3700 ఎకరాలలో పసుపు సాగు జరిగింది.. ఆ పసుపు ఇప్పటికే చాలా వరకు అమ్మకానికి తరలించారు.. సాగు చేసిన పసుపుకు ఎంత దొరికితే అంతే లాభం అనుకున్నట్లు అమ్మేసి వచ్చిన పైకంతో తిరిగి వెళ్లారు.. వ్యాపారుల చేతికి చేరిన తర్వాత ఒక్కసారిగా రెక్కలు రావడం రైతులకు మాత్రం కొంత ఆనందం మరికొంత విషాదం మిగిల్చింది. అయితే జాతీయ, అంతర్జాతీయ మార్కెట్ లో పసుపుకు విపరీతమైన డిమాండ్ పెరగడమే కారణంగా వ్యాపారాలు చెప్తున్నారు.. కాస్మోటిక్స్ తయారీ కంపెనీలు, ఫార్మా కంపెనీలు, పసుపు ప్రోడక్ట్ కంపెనీలు ఇక్కడి పసుపు కొనుగోలు చేయడానికి పోటీ పడడమే ఈ ధరలకు కారణమని మార్కెటింగ్ అధికారులు అంటున్నారు.. మొత్తం మీద పసుపు రైతుల్లో మాత్రం ఆనందం వ్యక్తం అవుతుంది.

ప్రథమ స్థానంలో నిజామాబాద్..

తెలంగాణ వ్యాప్తంగా పసుపు పంటను ఎక్కువ పండిస్తూ.. నిజామాబాద్ జిల్లా ప్రధమ స్థానంలో ఉంటుంది. నిజమాబాద్‌ జిల్లా వ్యాప్తంగా 40 వేల ఎకరాల్లో పసుపు సాగు చేస్తున్నారు రైతులు. తర్వాతి స్థానాల్లో జగిత్యాల, నిర్మల్ జిల్లాల్లో కూడా పసుపు పంట పండుతుంది. కానీ, గిట్టుబాటు ధర లేకపోవడంతో ఇటీవల గత కొంతకాలంగా రైతులు క్రమంగా పసుపు సాగు తగ్గిస్తూ వస్తున్నారు. ఎలాగోలా పసుపు వేసిన రైతులు పంట దిగుబడి, మార్కెట్‌ కు తరలించేంత వరకు కష్టపడాల్సి ఉంటుంది. పసుపు కొమ్ములు తవ్వడం, ఉడకబెట్టడం, ఆరబెట్టడం, కొమ్ము వేరు చేయడం, మార్కెట్‌‌కు తరలించడం ఎంతో వ్యవ ప్రయాసలతో కూడుకున్న పని. అందుకే రైతులు పసుపుకు దూరం అవుతున్నారు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..