AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఆటో కింద పడి పిల్ల కోతి మృతి.. వందలాదిగా వచ్చిన కోతులు ఏం చేశాయో తెలుసా.?

వివరాల్లోకి వెళితే.. ఇటీవల వరంగల్‌, కరీమాబాద్‌లోని సరస్వతి స్కూల్ ప్రాంతంలో ఆటో ఢీకొని ఓ కోతి పిల్ల మరణించింది. దీంతో అక్కడే ఉన్న తల్లి కోతి బిడ్డను రోడ్డుపై నుంచి పక్కకు లాక్కేళ్లేందుకు ప్రయత్నించింది. అయితే అదే సమయంలో ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదు కానీ కోతుల గుంపు ఒక్కసారిగా దూసుకొచ్చింది. వందలాది కోతులు గుంపులు గుంపులుగా ఆ ప్రాంతాకి వచ్చాయి. అటుగా వెళ్తున్న వారిపై దండయాత్ర చేశాయి. తమ జాతికి చెందిన జీవి ప్రాణాలు తీశారన్న పగో, మరెంటో కానీ..

Telangana: ఆటో కింద పడి పిల్ల కోతి మృతి.. వందలాదిగా వచ్చిన కోతులు ఏం చేశాయో తెలుసా.?
Representative Image
G Peddeesh Kumar
| Edited By: |

Updated on: Aug 12, 2023 | 8:23 AM

Share

నవ్వు, ఏడుపు, కోపం, పగా ఇవన్నీ కేవలం మనుషులకే పరిమితం అనుకుంటాం. అయితే ఈ భావోద్వేగాలకు జంతువులు కూడా మినహాయింపు కాదు. కొన్ని సంఘటనలు చూస్తుంటే ఇది నిజమే అనిపిస్తుంది. తాజాగా వరంగల్‌లో జరిగిన ఓ ఘటన చూస్తే జంతువులు కూడా పగా తీర్చుకుంటాయా.? అన్న ప్రశ్న తలెత్తక మానదు. ఈ విషయం తెలుసుకున్న తర్వాత కోతులు పగబడతాయా.? అంటే అవుననే అనుకుంటారు.

వివరాల్లోకి వెళితే.. ఇటీవల వరంగల్‌, కరీమాబాద్‌లోని సరస్వతి స్కూల్ ప్రాంతంలో ఆటో ఢీకొని ఓ కోతి పిల్ల మరణించింది. దీంతో అక్కడే ఉన్న తల్లి కోతి బిడ్డను రోడ్డుపై నుంచి పక్కకు లాక్కేళ్లేందుకు ప్రయత్నించింది. అయితే అదే సమయంలో ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదు కానీ కోతుల గుంపు ఒక్కసారిగా దూసుకొచ్చింది. వందలాది కోతులు గుంపులు గుంపులుగా ఆ ప్రాంతాకి వచ్చాయి. అటుగా వెళ్తున్న వారిపై దండయాత్ర చేశాయి. తమ జాతికి చెందిన జీవి ప్రాణాలు తీశారన్న పగో, మరెంటో కానీ ప్రజలపైకి ఎగబడ్డాయి.

ఈ క్రమంలో కొందరు వాహనదారులకు గాయాలు కూడా అయ్యాయి. కోతుల బీభత్సం చూసి అటుగా వెళ్తున్న ప్రజలు, వాహనాలను రోడ్డుపైనే వదిలేసి పరుగులు పెట్టారు. అనంతరం చనిపోయిన ఆ పిల్ల కోతిని అక్కడి నుంచి తీసుకెళ్లాయి. సుమారు గంటసేపు కోతులు బీభత్సాన్ని సృష్టించాయి. ఎవరైనా మనిషి చనిపోతే ఫోన్లలో సమాచారం ఇస్తేనే సకాలంలో బంధుమిత్రులు చేరుకోరు.. అలాంటిది ఏ సమాచారం లేకపోయినా ఈ మూగ జీవులకు ఎలా తెలిసింది..? ఇన్ని వందలాది కోతులు అంత తక్కువ సమయంలో ఎలా చేరుకున్నాయి.? అని స్థానికులు చర్చించుకున్నారు.

ఇవి కూడా చదవండి

పిల్ల కోతిని లాక్కెళ్లడానికి తల్లి కోతి ప్రయత్నిస్తున్న వీడియో..

ప్రతీకారం తీర్చుకోవడం కోసమే ఆ కోతలు దాడి చేశాయా అని చర్చించుకున్నారు. గంటసేపు ప్రజలపై దాడి చేసిన కోతులు అనంతరం చనిపోయిన పిల్ల కోతిని తీసుకెళ్లిపోయాయి. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఇక ఈ సంఘటనను స్థానికులు తమ స్మార్ట్ ఫోన్స్ లో రికార్డ్ చేశారు. దీంతో ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. వీడియోను వాట్సాప్ లో షేర్ చేస్తూ తెగ ట్రెండ్ చేస్తున్నారు. ఈ వార్త ఊరంగా ప్రచారం జరిగింది. ఈ ఘటనతో.. కోతులు ఇలా పగ తీర్చుకుంటాయా.? వానరాలు రివెంజ్‌ తీర్చుకుంటే ఇంత దారుణంగా ఉంటుందా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
కోట్ల రెమ్యునరేషన్ పక్కనపెట్టి కార్గిల్ యుద్ధంలో సైనికులతో కలిసి.
కోట్ల రెమ్యునరేషన్ పక్కనపెట్టి కార్గిల్ యుద్ధంలో సైనికులతో కలిసి.
వాట్సాప్‌లో అదిరిపోయే కొత్త ఫీచర్.. ఇక కాంటాక్ట్స్ కోసం..
వాట్సాప్‌లో అదిరిపోయే కొత్త ఫీచర్.. ఇక కాంటాక్ట్స్ కోసం..
సైబీరియా ప్లేగు పరిశోధనా ల్యాబ్‌లో రెండో మరణం..? WHO ఆందోళన
సైబీరియా ప్లేగు పరిశోధనా ల్యాబ్‌లో రెండో మరణం..? WHO ఆందోళన
క్యాండీ క్రష్‌తో వరల్డ్‌ రికార్డు క్రియేట్ చేసిన ఇండియన్ కుర్రాడు
క్యాండీ క్రష్‌తో వరల్డ్‌ రికార్డు క్రియేట్ చేసిన ఇండియన్ కుర్రాడు
నాకు మా నాన్న కావాలి.. ఎగ్జామ్‌లో చిన్నారి ఆన్సర్..
నాకు మా నాన్న కావాలి.. ఎగ్జామ్‌లో చిన్నారి ఆన్సర్..
నానా పటేకర్ భార్య ఎవరో తెలుసా.. ? పదేళ్ల తర్వాత..
నానా పటేకర్ భార్య ఎవరో తెలుసా.. ? పదేళ్ల తర్వాత..
.. బరువు తగ్గాలనుకునే వారికి, డయాబెటిస్ ఉన్న వారికి ఇదే బెస్ట్
.. బరువు తగ్గాలనుకునే వారికి, డయాబెటిస్ ఉన్న వారికి ఇదే బెస్ట్
త్రయోదశి శ్రాద్ధం ఈ పూర్వీకుల కోసమే చేస్తారా? తర్పణం, పిండదానం..
త్రయోదశి శ్రాద్ధం ఈ పూర్వీకుల కోసమే చేస్తారా? తర్పణం, పిండదానం..
10వ తరగతి, ఐటీఐతో రైల్వేలో 2,008 ఉద్యోగాలు.. నవంబర్ 6 వరకే ఛాన్స్
10వ తరగతి, ఐటీఐతో రైల్వేలో 2,008 ఉద్యోగాలు.. నవంబర్ 6 వరకే ఛాన్స్
పండగ ముందు సామాన్యులకు బిగ్‌ రిలీఫ్.. భారీగా తగ్గనున్న ఉల్లి ధరలు
పండగ ముందు సామాన్యులకు బిగ్‌ రిలీఫ్.. భారీగా తగ్గనున్న ఉల్లి ధరలు