Telangana: రికార్డు సృష్టిస్తోన్న పచ్చ బంగారం.. క్వింటా ధర తెలిస్తే పండగే..!

|

Jul 14, 2023 | 1:11 PM

నిజామాబాద్, జగిత్యాల, నిర్మల్‌ జిల్లాల్లో సుమారు 50వేల ఎకరాల్లో ఉండే పసుపు సాగు ఈ సారి 32వేల ఎకరాలకే పరిమితమైంది. దిగుబడి తగ్గడంతో ప్రస్తుతం ధర పెరిగింది. గత జనవరి నెలాఖరులో ప్రారంభమైన పసుపు కొనుగోళ్లు ఏప్రిల్‌ వరకు కొనసాగాయి. ఈ సీజన్‌లో కొమ్ము గరిష్ట ధర రూ. 7,800లోపే పలికింది. తాజాగా

Telangana: రికార్డు సృష్టిస్తోన్న పచ్చ బంగారం.. క్వింటా ధర తెలిస్తే పండగే..!
Turmeric Price
Follow us on

పచ్చబంగారం పండిస్తున్న రైతన్న సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. ఎట్టకేలకు గిట్టుబాటు ధర పలకడంతో రైతు కళ్లల్లో ఆనందం కనిపించింది. నిజామాబాద్‌ మార్కెట్‌లో పసుపు ధర రికార్డులు సృష్టిస్తోంది. క్వింటా పసుపు ధర 10 వేల మార్క్‌ను దాటింది. దీంతో కోల్డ్ స్టోరేజీలో నిల్వచేసుకున్న రైతుల పంట పడుతోంది. ముందే పంటను అమ్ముకున్న రైతులు నిరాశ చెందుతున్నారు. నిజిమాబాద్‌ వ్యవసాయ మార్కెట్ యార్డులో పసుపు పంటకు ఈ సీజన్‌లోనే రికార్డు స్థాయి ధర లభించింది.

గురువారం నిజామాబాద్‌ జిల్లా అంకాపూర్‌ గ్రామానికి చెందిన రైతు మధసూధన్‌ రెడ్డి మార్కెట్‌కు 38 క్వింటాళల్ పసుపు పంటను తరలించాడు. కమీషన్‌ ఏజెంటు హన్మంతరావు అండ్‌ కంపెనీ కొనుగోలు చేశారు. ఇదే రైతు తీసుకొచ్చిన పసుపు మండ రకానికి క్వింటాకు రూ.9,211లుగా ధర పలికింది.

గత జనవరి నెలాఖరులో ప్రారంభమైన పసుపు కొనుగోళ్లు ఏప్రిల్‌ వరకు కొనసాగాయి. ఈ సీజన్‌లో కొమ్ము గరిష్ట ధర రూ. 7,800లోపే పలికింది. తాజాగా రూ. 10,116 ధర పలకడం విశేషం. నిజామాబాద్, జగిత్యాల, నిర్మల్‌ జిల్లాల్లో సుమారు 50వేల ఎకరాల్లో ఉండే పసుపు సాగు ఈ సారి 32వేల ఎకరాలకే పరిమితమైంది. దిగుబడి తగ్గడంతో ప్రస్తుతం ధర పెరిగింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..