TSRTC: ప్రయాణీకులకు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్.. అతి తక్కువ ఛార్జీతో.. ఐదు పుణ్యక్షేత్రాల సందర్శన..

|

Nov 05, 2022 | 7:55 AM

కార్తీక మాసం శివ విష్ణువులకు ఎంతో పవిత్రం. ఈ సమయంలో శైవ ఆలయాలను దర్శించుకునేందుకు భక్తులు ఆసక్తి చూపిస్తుంటారు. శివయ్యను దర్శించుకునేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఈ క్రమంలో భక్తుల ఇబ్బందులను..

TSRTC: ప్రయాణీకులకు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్.. అతి తక్కువ ఛార్జీతో.. ఐదు పుణ్యక్షేత్రాల సందర్శన..
Follow us on

శివ విష్ణువులకు కార్తీక మాసం ఎంతో పవిత్రం. ఈ సమయంలో శైవ ఆలయాలను దర్శించుకునేందుకు భక్తులు ఆసక్తి చూపిస్తుంటారు. శివయ్యను దర్శించుకునేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఈ క్రమంలో భక్తుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ ప్రయాణీకులకు శుభవార్త చెప్పింది. తక్కువ ఛార్జీతో ఐదు ఆలయాల సందర్శనకు కార్తీకమాస దర్శిని ప్యాకేజీ – 2 ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఉదయం 7 గంటలకు సికింద్రాబాద్‌ గురుద్వారా వద్ద ప్రారంభమయ్యే యాత్ర అలియాబాద్‌ (రత్నాలయం), వర్గల్‌ (మహా సరస్వతి), కొమరవెల్లి (మల్లన్న స్వామి), కీసర గుట్ట (రామలింగేశ్వర స్వామి), చేర్యాల (లక్ష్మీ నరసింహ స్వామి) ఆలయాలను దర్శించుకునేలా ప్యాకేజీని రూపొందించారు. దర్శనం అనంతరం పికప్ పాయింట్ వద్దే డ్రాపింగ్ ఉంటుంది. పెద్దలకు రూ. 500, పిల్లలకు రూ.300 ఛార్జీ ఉంటుంది. అయితే.. ఆలయాల్లో దర్శనం, భోజన ఖర్చులు ప్రయాణీకులే చెల్లించాల్సి ఉంటుంది. అంతే కాకుండా శ్రీశైలం వెళ్లే భక్తుల కోసం కూడా ప్రత్యేక బస్సులు నడిపిస్తోంది. రాత్రి వేళల్లో ఎక్కడా ఆగకుండా శ్రీశైలంలో దర్శనం చేసుకునేలా వీలు కల్పించారు.

సాధారణంగా రాత్రివేళల్లో శ్రీశైలం ఘాట్‌ రోడ్ లో రాత్రి వేళల్లో బస్సులను అనుమతించేవారు కాదు. అయితే.. ఎంజీబీఎస్, జూబ్లీ బస్టాండ్ల నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులను మున్ననూర్, దోమలపెంట చెక్‌పోస్టుల వద్ద నిలపకుండా రాత్రివేళల్లోనూ ప్రయాణానికి అనుమతించాలని అధికారులు ఫారెస్ట్‌ ఆఫీసర్ల దృష్టికి తీసుకువెళ్లారు. ఇందుకు అంగీకరించిన అటవీ అధికారులు ఈ నెల 20 వరకు అనుమతించారు. హైదరాబాద్‌ నుంచి శ్రీశైలం వెళ్లే ప్రయాణికులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.

మరోవైపు.. ఏపీఎస్ఆర్టీసీ కూడా కార్తీక మాసం సందర్భంగా ప్రత్యేక బస్సులు నడిపిస్తోంది. విజయవాడ బస్టాండ్ నుంచి నవంబర్ నెలాఖరు వరకు బస్సులు నడననున్నాయి. పంచారామ క్షేత్రాలైన అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామం, సామర్లకోటలను ఒకే రోజులో దర్శించుకునే అవకాశం కల్పిస్తోంది. విజయవాడ బస్టాండ్ నుంచి ఉదయం 4 గంటలకు బస్సులు బయల్దేరి తిరిగి అదేరోజు రాత్రికి విజయవాడ చేరుకుంటాయి. వీటితో పాటు త్రిలింగ దర్శిని కార్యక్రమంలో భాగంగా యాగంటి, మహానంది, శ్రీశైలం క్షేత్రాల సందర్శనకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి