AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TSRTC Income: ఈ సంక్రాంతి టీఎస్ ఆర్టీసీకి బాగా కలిసొచ్చింది.. ఎంత ఆదాయం వచ్చిందో తెలుసా!

TSRTC Sankranthi Income: తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తీసుకున్న చర్యలు ఫలించాయి. నష్టాల్లో ఉన్న ఆర్టీసికి ఉపిరి పోసినట్లైంది. ఈ సంక్రాంతి పండుగ తెలంగాణ​ఆర్టీసీకి నిజంగా కాంతులు తీసుకువచ్చింది.

TSRTC Income: ఈ సంక్రాంతి టీఎస్ ఆర్టీసీకి  బాగా కలిసొచ్చింది.. ఎంత ఆదాయం వచ్చిందో తెలుసా!
Rtc
Balaraju Goud
|

Updated on: Jan 18, 2022 | 5:07 PM

Share

TSRTC Sankranthi Income: తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తీసుకున్న చర్యలు ఫలించాయి. నష్టాల్లో ఉన్న ఆర్టీసికి ఉపిరి పోసినట్లైంది. ఈ సంక్రాంతి పండుగ తెలంగాణ​ఆర్టీసీకి నిజంగా కాంతులు తీసుకువచ్చింది. పండుగ పూట ప్రయాణికుల చేరువేతలో రికార్డు సృష్టించి కాసుల వర్షం కురిపించింది. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి ఎక్కువ మంది సొంతూర్లకు రాకపోకలు సాగించారు. ఇందుకోసం ముందస్తు ప్రణాళిక ప్రకారం తెలంగాణ ఆర్టీసీ దాదాపు 4,000 స్పెషల్ బస్సులను రెండు తెలుగు రాష్ట్రాలకు నడిపింది. మొత్తానికి ఈ పండగ సీజన్‌లో ఆర్టీసీకి సుమారు రూ.107 కోట్ల మేర ఆదాయం వచ్చినట్లుగా టీఎస్‌ఆర్టీసీ ఒక ప్రకటనలో విడుదల చేసింది. అదనపు బస్సుల ద్వారా సుమారు 55లక్షల మంది ప్రయాణికులను వారివారి గమ్యస్థానాలకు చేరవేసినట్లు వెల్లడించింది. దీంతో అనుకున్నదానికంటే అదనపు ఆదాయం సమకూరినట్లు సమాచారం. అసలే నష్టాల్లో ఉన్న ఆర్టీసీకి ఈ పండగ సీజన్‌లో కాస్త ఊరట లభించినట్లయింది.

అయితే, ఈసారి ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పక్కా ఫ్లాన్‌తో ముందుకు వెళ్లారు. ప్రయాణికుల సౌకర్యార్థం ప్రయాణ ఛార్జీలను ఏం పెంచకుండా జాగ్రత్తపడ్డారు. సాధారణంగా రద్దీ ఉన్న సమయాల్లో టికెట్లను 50 శాతం పెంచుతారు. ఎందుకంటే తిరుగు ప్రయాణాల్లో ప్రయాణికుల సంఖ్య తక్కువగా ఉంటుంది. ఆ నష్టాన్ని భరించేందుకు ఇలా చేస్తుంటారు. కానీ, ఈ సంక్రాంతికి ఆర్టీసీ పక్కా ప్రణాళిక పరంగా ముందుకు వెళ్లింది. దసరాకు సాధారణ ఛార్జీలు మాత్రమే వసూలు చేసి అందరి మెప్పును పొందింది.

మరోవైపు, ఇదే టైంలో ఏపీఎస్​ఆర్టీసీ అదనపు ఛార్జీలు బాదడం తెలంగాణ ఆర్టీసీకి బాగా కలిసి వచ్చింది. సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ నెల 7 నుంచి 14 వరకు 4,000 ప్రత్యేక బస్సు సర్వీసులను నడిపించింది. అందులో ఆంధ్రప్రదేశ్​కు వెయ్యి బస్సులు కాగా మిగిలిన 3,000 బస్సులను తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు నడిపింది.

పండక్కి నడిపిన స్పెషల్ బస్సుల ద్వారా సుమారు 50లక్షల మందిని గమ్య స్థానాలకు అత్యంత క్షేమంగా చేర్చినట్లుగా ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఇవి కాక, రోజూ తిరిగే 4,600 సర్వీసుల ద్వారా మరో 5 లక్షల మందిని సొంతూళ్లకు చేరవేసినట్లు అధికారులు వివరించారు. మొత్తానికి ఈ పండుగ సీజన్‌లో 55 లక్షలకు పైగా ప్రయాణికులకు సురక్షిత ప్రయాణం కల్పించినట్లు ఆర్టీసీ వెల్లడించింది. ఆర్టీసీని ఇంతలా ప్రజల ఆదరిచడం వల్లనే ఇది సాద్యం అయింది అని…ఇలాగే ఆదరణ కొనసాగాలని ప్రయాణికులు ను అభినందించారు rtc చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఆర్టీసీ ఎండీ సజ్జనార్.

Read Also…  Ministers Warangal tour: పంట నష్టపోయిన ప్రతీ రైతునూ ఆదుకుంటాం.. భరోసా ఇచ్చిన మంత్రులు