Telangana: హైదరాబాద్‌ నుంచి విజయవాడ వెళ్లేవారికి గుడ్ న్యూస్ చెప్పిన TSRTC

|

Apr 29, 2024 | 6:17 PM

ఈ వేసవి కాలంలో విజయవాడకు వెళ్లే ప్రయాణికులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) శుభవార్త చెప్పింది. ఈ బస్సులలో లహరి ఏసీ స్లీపర్ 2, నాన్ ఏసీ స్లీపర్ కమ్ సీటర్ 2, ఈ-గరుడ 10, గరుడ ప్లస్ 9, రాజధాని 41, సూపర్ లగ్జరీ బస్సులు 62 ఉన్నట్లు టీఎస్‌ఆర్టీసీ తెలియజేసింది. అంతేకాదు

Telangana: హైదరాబాద్‌ నుంచి విజయవాడ వెళ్లేవారికి గుడ్ న్యూస్ చెప్పిన TSRTC
TSRTC Offer
Follow us on

ప్రజంట్ ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఎలక్షన్ హీట్ నడుస్తోంది. మరోవైపు వేసవి సెలవుల నేపథ్యంలో.. పలు కుటుంబాలు సొంతూర్లకు వెళ్తున్నాయి. ఈ క్రమంలో బస్సుల్లో, రైళ్లలో రద్దీ కనిపిస్తుంది. ఒత్తిడి తగ్గించేందుకు TSRTC అదనపు సర్వీసులు అందుబాటులోకి తెచ్చింది. తాజాగా  హైదరాబాద్ నుంచి విజయవాడకు బస్సుల్లో ప్రయాణించేవారి కోసం TSRTC సూపర్ ఆఫర్ ప్రకటించింది.

హైదరాబాద్-విజయవాడ రూట్‌లో ప్రతి 10 నిమిషాలకు ఒక బస్సు అందుబాటులో ఉంటుందని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ తెలిపింది. ఈ రూట్‌లో ప్రతిరోజు 120కి పైగా బస్సులను సంస్థ నడుపుతోందని TSRTC MD సజ్జనార్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు. అందులో సూపర్ లగ్జరీ 62, రాజధాని 41, లహరి ఏసీ స్లీపర్ 2, నాన్ ఏసీ స్లీపర్ కమ్ సీటర్ 2, ఈ-గరుడ 10, గరుడ ప్లస్ 9 బస్సులున్నాయన్నారు. ఈ బస్సుల్లో ముందు రిజర్వేషన్ చేసుకుంటే.. 10 శాతం రాయితీ ఇస్తున్నట్లు చెప్పారు. రిటన్ జర్నీ టికెట్‌పై ఈ రాయితీ ఆఫర్ వర్తిస్తుందని అన్నారు. TSRTC బస్సుల్లో అడ్వాన్స్డ్ రిజర్వేషన్ కోసం అఫీషియల్ వెబ్ సైట్ http://tsrtconline.in ని సంప్రదించాలని సజ్జనార్ ట్వీట్ చేశారు. ఈ సమ్మర్‌లో హైదరాబాద్‌ నుంచి విజయవాడ మార్గంలో ఎన్నికల్లో ఓటు వేయడానికి వెళ్లేవారికి.. ఈ ఆఫర్ బాగా ఉపయోగపుడుతుందని చెప్పవచ్చు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..