Telangana: టీఎస్‌పీఎస్‌సీ లీకేజీ వ్యవహారంలో రోజుకో ట్విస్ట్.. బయటపడుతున్న సంచలన నిజాలు..!

|

Mar 22, 2023 | 4:39 PM

టీఎస్‌పీఎస్‌సీ లీకేజీ వ్యవహారంలో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. తవ్వేకొద్దీ సంచలనాలు బయటపడుతూనే ఉన్నాయి. కమిషన్‌లో పని చేస్తున్న 10 మంది ఉద్యోగులు గ్రూప్-1 ప్రిలిమ్స్‌లో క్వాలిఫై అయినట్లు గుర్తించారు సిట్ అధికారులు.

Telangana: టీఎస్‌పీఎస్‌సీ లీకేజీ వ్యవహారంలో రోజుకో ట్విస్ట్.. బయటపడుతున్న సంచలన నిజాలు..!
TSPSC
Follow us on

టీఎస్‌పీఎస్‌సీ లీకేజీ వ్యవహారంలో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. తవ్వేకొద్దీ సంచలనాలు బయటపడుతూనే ఉన్నాయి. కమిషన్‌లో పని చేస్తున్న 10 మంది ఉద్యోగులు గ్రూప్-1 ప్రిలిమ్స్‌లో క్వాలిఫై అయినట్లు గుర్తించారు సిట్ అధికారులు. ఆ 10 మందికి ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. వీరిలో ముగ్గురు ఔట్‌ సోర్సింగ్ ఉద్యోగులు, ఏడుగురు రెగ్యులర్ ఉద్యోగులు ఉన్నట్లు గుర్తించారు. ఇందులో ఒకరిని అదపులోకి తీసుకొని ప్రశ్నిస్తోంది సిట్.

ఇప్పటికే అరెస్టైన 9 మంది నిందితులను వరుసగా ఐదో రోజూ విచారిస్తోంది సిట్. ప్రధాన నిందితులు ప్రవీణ్‌, రాజశేఖర్‌ పెన్‌డ్రైవ్‌ నుంచే క్వశ్చన్‌ పేపర్లు లీకయ్యాయని గుర్తించారు. 14 లక్షల నగదు లావాదేవీలపైనా ప్రశ్నిస్తున్నారు. క్వశ్చన్‌ పేపర్లు ఇచ్చిన రేణుకకు నీలేశ్ & గోపాల్ ద్వారా 14 లక్షల నగదు అందినట్లు ఆధారాలు సేకరించింది సిట్. అటు రాజశేఖర్ కాంటాక్ట్స్ & వాట్సప్ చాటింగ్ వివరాల ఆధారంగా కీలక సమాచారం రాబడుతున్నారు. రాజశేఖర్ స్నేహితుడు సురేష్ గ్రూప్-1 ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వడంతో అతడిని కూడా అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తోంది సిట్. సురేష్ & రాజశేఖర్ మధ్య లావాదేవీలపైనా ఆరా తీస్తున్నారు.

టీఎస్‌పీఎస్‌సీ కాన్ఫిడెన్షియల్ సెక్షన్‌ సూపరింటెండెంట్ శంకర్ లక్ష్మిని ఇప్పటికే విచారించింది సిట్. ఆమె స్టేట్‌మెంట్‌ను కూడా రికార్డ్ చేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..