AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TSPSC Paper Leak: ప్రవీణ్ వ్యవహారంలో మరిన్ని అనుమానాలు..! టీఎస్‌పీఎస్సీ నెక్స్ట్ మూవ్ ఏంటి.?

టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్స్ వ్యవహారం వెలుగులోకి మరిన్ని సంచలనాలు వస్తున్నాయి. ప్రవీణ్ వ్యవహారంపై మరిన్ని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

TSPSC Paper Leak: ప్రవీణ్ వ్యవహారంలో మరిన్ని అనుమానాలు..! టీఎస్‌పీఎస్సీ నెక్స్ట్ మూవ్ ఏంటి.?
TSPSC
Shiva Prajapati
|

Updated on: Mar 14, 2023 | 6:59 PM

Share

టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్స్ వ్యవహారం వెలుగులోకి మరిన్ని సంచలనాలు వస్తున్నాయి. ప్రవీణ్ వ్యవహారంపై మరిన్ని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గ్రూఫ్‌ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్ పేపర్ కూడా లీక్‌ అయినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. టీఎస్‌పీఎస్‌సీ మాజీ అధికారులు, ఇతర అభ్యర్థులు ఇదే సందేహాలను లేవనెత్తుతున్నారు. గ్రూప్ 1 ప్రిలిమ్స్‌‌లో ప్రవీణ్‌కు 103 మార్కులు వచ్చాయి. అయితే, ప్రవీణ్‌కు అన్ని మార్కులు రావడం అంత ఈజీ కాదంటున్నారు మాజీ అధికారులు. సెక్రటరీ పీఏ గా ఉంటూ రోజు ఆఫీసు పనులు చేసుకునే ప్రవీణ్‌కు 103 మార్కుల రావడంపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఐదేళ్ల నుంచి గ్రూప్స్‌ చదువుతున్న అభ్యర్థులు కూడా స్కోర్‌ చేయని మార్కులు ప్రవీణ్‌ చేయడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తూనే, అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సెక్రటరీ పీఏ లేదా ఇతర ఉద్యోగులు గ్రూప్స్‌ రాయలంటే ఖచ్చితంగా 2నెలలు సెలవు పెట్టాలని అంటున్నారు. కానీ, ప్రవీణ్ ఏమాత్రం సెలవు పెట్టకుండానే గ్రూప్స్ రాయడం అందరి అనుమానాలకు బలం చేకూరుస్తుంది.

అయితే, గ్రూప్స్ రాసే ఉద్యోగులను ఎగ్జామ్స్ డ్యూటీ నుంచి తప్పించాల్సిన బాధ్యత కమీషన్‌దే అని అంటున్నారు మాజీ అధికారులు. టీఎస్‌పీఎస్‌సీ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే పేపర్ లీక్స్ జరిగాయని అంటున్నారు.

కాగా, సెక్రటరీ డైరీ నుంచి యూజర్‌ నేమ్ పాస్‌వర్డ్‌ చోరీ చేసి ప్రవీణ్‌ పేపర్‌ లీక్‌ చేసినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కమీషన్‌ చైర్మన్‌, సెక్రటరీకి ప్రశ్నపత్రాల యాక్సెస్‌ ఉంటుంది. సెక్రటరీ పీఏగా ఉంటూ ప్రశ్నప్రతాలను లీక్‌ చేసినట్లుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ప్రవీణ్‌ ఇంకెంత మందికి ప్రశ్నపత్రాలు లీక్‌ చేశాడనే దానిపై పోలీసుల ఆరా తీస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..