TSPSC Exam Date: టీఎస్పీయస్సీ హార్టికల్చర్‌ ఆఫీసర్‌ పోస్టులకు హాల్‌టికెట్లు విడుదల.. జూన్‌ 17న రాత పరీక్ష

|

Jun 11, 2023 | 8:17 PM

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హార్టికల్చర్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి జూన్‌ 17న రాత పరీక్ష నిర్వహిస్తున్నట్లు తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్పీయస్సీ) ప్రకటించింది. ఈ పరీక్షకు హాజరయ్యే విద్యార్ధులు అధికారిక వెబ్‌సైట్‌ నుంచి హాల్‌ టికెట్లను జూన్‌ 11వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి డౌన్‌లోడ్‌..

TSPSC Exam Date: టీఎస్పీయస్సీ హార్టికల్చర్‌ ఆఫీసర్‌ పోస్టులకు హాల్‌టికెట్లు విడుదల.. జూన్‌ 17న రాత పరీక్ష
TSPSC Horticulture Officer Exam
Follow us on

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హార్టికల్చర్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి జూన్‌ 17న రాత పరీక్ష నిర్వహిస్తున్నట్లు తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్పీయస్సీ) ప్రకటించింది. ఈ పరీక్ష జూన్‌ 17వ తేదీన ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగనున్నట్లు వెల్లడించింది. ఈ పరీక్షకు సంబంధించిన హాల్‌ టికెట్లు ఆదివారం (జూన్‌ 11) విడుదలయ్యాయి.

పరీక్షకు హాజరయ్యే విద్యార్ధులు అధికారిక వెబ్‌సైట్‌ నుంచి హాల్‌ టికెట్లను జూన్‌ 11వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. పరీక్షకు 45 నిమిషాల ముందు వరకూ హాల్‌టికెట్లు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయని ఈ సందర్భంగా కమిషన్‌ తెలిపింది.

కాగా మొత్తం 22 హార్టికల్చర్‌ ఆఫీసర్‌ పోస్టులను ఈ నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేయనున్నారు. ఎంపిక విధానంలో ప్రతిభకనబరచిన వారు నెలకు రూ.51,320ల నుంచి రూ.1,27,310ల వరకు జీతంతో కొలువు సొంతం చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.