TSPSC: ఈసారి సరికొత్త విధానంలో టీఎస్‌పీఎస్‌సీ ఎగ్జామ్స్.. వివరాలివే..

టీఎస్‌పీఎస్‌సీ క్వశ్చన్ పేపర్ లీక్ వ్యవహారంలో ఒకవైపు సిట్‌ దూకుడుగా విచారణ చేస్తుండగా.. మరోవైపు పరీక్షల నిర్వహణకు కొత్త షెడ్యూల్‌ విడుదలైంది. అయితే, ఈసారి పరీక్షలు కొత్త విధానంలో పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఆన్‌లైన్‌ అండ్ ఓఎంఆర్ విధానం అమలు చేయనున్నట్లు సమాచారం.

TSPSC: ఈసారి సరికొత్త విధానంలో టీఎస్‌పీఎస్‌సీ ఎగ్జామ్స్.. వివరాలివే..
TSPSC Revised Exam Dates

Updated on: Mar 30, 2023 | 6:00 AM

టీఎస్‌పీఎస్‌సీ క్వశ్చన్ పేపర్ లీక్ వ్యవహారంలో ఒకవైపు సిట్‌ దూకుడుగా విచారణ చేస్తుండగా.. మరోవైపు పరీక్షల నిర్వహణకు కొత్త షెడ్యూల్‌ విడుదలైంది. అయితే, ఈసారి పరీక్షలు కొత్త విధానంలో పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఆన్‌లైన్‌ అండ్ ఓఎంఆర్ విధానం అమలు చేయనున్నట్లు సమాచారం. అవును, పేపర్స్‌ లీకేజీ ఎపిసోడ్‌లో గుట్టు మొత్తం విప్పేందుకు సిట్‌ ప్రయత్నిస్తుంటే, డ్యామేజీ కంట్రోల్‌ కోసం రంగంలోకి దిగింది టీఎస్‌పీఎస్‌సీ. రద్దైన అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ AEE నియామక పరీక్షలను తిరిగి నిర్వహించేందుకు కొత్త షెడ్యూల్‌ను ప్రకటించింది. ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌ పోస్టులకు మే 8న, అగ్రికల్చర్‌, మెకానికల్‌ పోస్టులకు మే 9న పరీక్షలు నిర్వహించనుంది. ఇక, సివిల్‌ పోస్టులకు మే 21న ఎగ్జామ్‌ కండక్ట్‌ చేయనుంది తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌. పేపర్స్‌ లీకేజీతో ఈసారి కట్టుదిట్టమైన జాగ్రత్తలు తీసుకుంటోంది. కొన్నింటికీ ఆన్‌లైన్‌లో, మరికొన్నింటికీ OMR విధానంలో పరీక్షలు నిర్వహించబోతోంది

మరోవైపు, పేపర్‌ లీకేజీ కేసులో మరింత దూకుడు పెంచింది సిట్‌. ఇప్పటివరకు 84మంది గ్రూప్‌-1 అభ్యర్ధులను ప్రశ్నించి కీలక సమాచారం రాబట్టింది. అయితే, లేటెస్ట్‌గా కొత్త విషయం ఒకటి బయటికొచ్చింది. A1 ప్రవీణ్‌ తన కోసమే గ్రూప్‌-1 పేపర్‌ను కొట్టేసినట్టు సిట్‌ దర్యాప్తులో తేలింది. ఆ తర్వాత ప్రవీణ్‌ నుంచి టీఎస్‌పీఎస్‌సీ ఉద్యోగులతోపాటు మొత్తం 12మందికి పేపర్‌ చేరినట్టు తేల్చింది. ఇందుకు సంబంధించిన ఆధారాలను ప్రవీణ్‌, రాజశేఖర్‌, షమీమ్‌, రమేష్‌, సురేష్‌ దగ్గర్నుంచి సేకరించింది సిట్‌.

AE పేపర్‌ ముందుగా 12మందికి చేరినట్టు ఆధారాలు దొరికాయ్‌. డాక్యా నాయక్‌, రాజేందర్‌ కలిసి AE పేపర్‌ను కొన్నట్టు గుర్తించారు అధికారులు. AE పరీక్ష రాసిన నలుగురు నిందితుల నుంచి కీలక సమాచారం రాబడుతోంది సిట్‌. అసలు, సూత్రధారులెవరనేది కనిపెట్టేందుకు ఇంటరాగేట్‌ చేస్తోంది. ఇక, గ్రూప్‌-1 పేపర్‌ లీకేజీ కేసులో ముగ్గురు నిందితులను వారంరోజుల కస్టడీకి ఇవ్వాలని కోరింది సిట్‌. ఈ పిటిషన్‌ రేపు విచారణను రానుంది. ఒకవైపు రద్దుచేసిన పరీక్షలను తిరిగి నిర్వహించేందుకు TSPSC ప్రక్రియ మొదలుపెడితే, అసలు లీకేజీ వెనక కుట్రధారులెవరో, ఎవరెవరు ఇందులో ఉన్నారో కనిపెట్టేందుకు ప్రయత్నిస్తోంది సిట్‌.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..