TS Govt Jobs: మరో గుడ్‌న్యూస్.. తెలంగాణ విద్యుత్ శాఖలో 100 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

|

Apr 03, 2023 | 1:58 PM

TSNPDCL Recruitment 2023: తెలంగాణ రాష్ట్ర విద్యుత్‌ మంత్రిత్వ శాఖకు చెందిన నార్తర్న్‌ పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీ ఆఫ్‌ తెలంగాణ లిమిటెడ్‌ (ఎన్పీడీసీఎల్‌).. రెగ్యులర్ ప్రాతిపదికన 100 జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు..

TS Govt Jobs: మరో గుడ్‌న్యూస్.. తెలంగాణ విద్యుత్ శాఖలో 100 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల
TSNPDCL
Follow us on

తెలంగాణ రాష్ట్ర విద్యుత్‌ మంత్రిత్వ శాఖకు చెందిన నార్తర్న్‌ పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీ ఆఫ్‌ తెలంగాణ లిమిటెడ్‌ (ఎన్పీడీసీఎల్‌).. రెగ్యులర్ ప్రాతిపదికన 100 జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత పొందిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అలాగే ఎమ్‌ఎస్‌ ఆఫీస్‌/కంప్యూటర్ అస్లికేషన్‌లో సర్టిఫికెట్‌ కోర్సు పూర్తి చేసి ఉండాలి. అభ్యర్ధుల వయసు జనవరి 1, 2023వ తేదీ నాటికి 18 నుంచి 44 ఏళ్లకు మించకుండా ఉండాలి.

ఈ అర్హతలున్నవారు ఆన్‌లైన్‌ విధానంలో ఏప్రిల్‌ 29, 2023వ తేదీ రాత్రి 11:59 గంటలలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏప్రిల్‌ 10 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుంది. దరఖాస్తు సమయంలో ప్రతిఒక్కరూ రూ.320లు రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించాలి. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైనవారికి నెలకు రూ.29,255ల నుంచి రూ.54,380ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.