Hyderabad Rains: హైదరాబాద్ నగరంలో దాదాపు గంటపాటు ఆగకుండా ఉరుములు మెరుపులతో భారీగా వర్షం కురిసింది. అకస్మాత్తుగా కురిసిన వర్షంతో నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మెహదీ పట్నం, టోలిచౌకి, అత్తాపూర్ తో పాటు మాసబ్ ట్యాంక్, నాంపల్లి, అఫ్జల్ గంజ్ , హిమాయత్ నగర్, నారాయణగూడ, ముషీరాబాద్ , బంజారా హిల్స్ సహా అనేక ప్రాంతాల్లో కుండపోత గా వాన కురిసింది. రోడ్లన్నీ జలమయం అయ్యాయి. జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఆఫీసులో ముగించుకొని ఇంటికి వెళుతున్న టైం లో భారీ వర్షం పడటంతో హైదరాబాదీలు ట్రాఫిక్ జామ్ లో చిక్కుకున్నారు. అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఎర్రగడ్డ, మూసాపేట్, ఫతే నగర్, బల్కం పేట్ రోడ్లమీద భారీగా వర్షపు నీరు నిలిచిపోయింది. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
మరోవైపు బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12 లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడడంతో.. కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి విరించి సర్కిల్ వెళ్లే దారిలో గంటకు పైగా వాహనాలు నిలిచిపోయాయి. పెన్షన్ ఆఫీస్ దగ్గర వర్షానికి భారీగా నీరు నిలవడంతో వాహనదారులు తీవ్ర ఇక్కట్లు పడ్డారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..