Rains Alert: తెలంగాణ వాసులకు అలెర్ట్.. మరో రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం.. ఎల్లో అలర్ట్‌ జారీ

రానున్న 48 గంటలు రాష్ట్రంలో ఇదే విధమైన వాతావరణం కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ఇక ఇవాళ, రేపు అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ వెల్లడించింది.

Rains Alert: తెలంగాణ వాసులకు అలెర్ట్.. మరో రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం..  ఎల్లో అలర్ట్‌ జారీ
Rains

Updated on: Mar 20, 2023 | 6:54 AM

తెలంగాణలో మరో రెండురోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. కర్ణాటక నుంచి పశ్చిమ విదర్భ వరకూ మహారాష్ట్ర మీదుగా ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. వచ్చే
24 గంటల్లో ఆదిలాబాద్ ,మంచిర్యాల , పెద్దపల్లి, జయశకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, వరంగల్, హన్మకొండ , జనగాం , యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్‌జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని వాతావరణశాఖ ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది.

ఇక రానున్న 48 గంటలు రాష్ట్రంలో ఇదే విధమైన వాతావరణం కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ఇక ఇవాళ, రేపు అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ వెల్లడించింది. ఇక గడిచిన 24 గంటల్లో ములుగుజిల్లా వెంకటాపురంలో 15.6 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..